Homeటాప్ స్టోరీస్`పుష్ప‌`లో ఆ హీరో నిజ‌మేనా?

`పుష్ప‌`లో ఆ హీరో నిజ‌మేనా?

`పుష్ప‌`లో ఆ హీరో నిజ‌మేనా?
`పుష్ప‌`లో ఆ హీరో నిజ‌మేనా?

అల వైకుంఠ‌పుర‌ములో` వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌రువాత అల్లు అర్జున్ న‌టిస్తున్న చిత్రం `పుష్ప‌`. లెక్క‌ల మాస్టారు సుకుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ముత్యంశెట్టి మీడియా, మైత్రీ మూవీమేక‌ర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంపై ఊహించ‌ని వార్త ఓక‌టి హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. స్లైలిష్ స్టార్ బ‌న్నీ ఊర మాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న ఈ చిత్రంలో నారా హీరో నారా రోహిత్ న‌టించ‌నున్నార‌న్న‌ది తాజా వార్త‌.

ఇది చాలా మందికి న‌మ్మ‌క‌లేని వార్తే అయినా ఇదే నిజ‌మ‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. సినిమాలో విల‌న్ పాత్ర ఇంత వ‌ర‌కు సెట్ట‌వ‌లేదు. అయితే మ‌రో బ్యాచ్‌కి కీల‌కంగా నిలిచే ఓ పాత్ర వుంద‌ట‌. ఆ పాత్ర కోసం నారా రోహిత్‌ని సుక్ంకు అండ్ కో అనుకుంటున్నార‌ట‌. ఇంత‌కీ స‌ర్‌ప్రైజింగ్ విష‌యం ఏంటంటే ఆ పాత్ర కోసం నారా రోహిత్‌ని స్వ‌యంగా బ‌న్నీ రిక‌మెండ్ చేయ‌డం.

- Advertisement -

విన‌డానికి వింత‌గా వున్నా ఇదే నిజం అని టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇటీవ‌లే స్లిమ్‌గా మారి త‌న లుక్‌ని మార్చుకున్న నారా రోహిత్ `పుష్ప‌`లో న‌టించ‌డానికి అంగీక‌రించ‌డం ఏంట‌నేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కెరీర్ తొలి నాళ్ల‌లో వ‌రుస ప్రాజెక్ట్‌ల‌ని ప్ర‌క‌టించిన నారా రోహిత్ త‌న చుట్టూ పెంచుకున్న కోట‌రీ కార‌ణంగా లైమ్ లైట్‌లో లేకుండా పోయారు. తాజాగా మ‌ళ్లీ వ‌రుస‌గా సినిమాల్ని మొద‌లుపెట్టాల‌నుకుంటున్న టైమ్‌లో `పుష్ప‌`లో ఆఫ‌ర్ అంటూ వార్త‌లు రావ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All