
యావత్ సినీ లోకం ఎదురుచూస్తున్న ఎదురుచూపులు తెరపడింది. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. నిన్న గురువారం అర్ధరాత్రి నుండే షోస్ మొదలవ్వడం తో సోషల్ మీడియా లో ఆర్ఆర్ఆర్ ట్రేడ్ నడుస్తుంది. అభిమానులు , సినీ ప్రముఖులు , సామాన్య ప్రేక్షకులు మాత్రమే కాదు రాజకీయ నేతలు సైతం సినిమా ఫై ట్వీట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో నారా లోకేష్ సినిమా ఫై ట్వీట్స్ చేసి ఆకట్టుకున్నారు.
‘ఆర్ఆర్ఆర్ సినిమాకు మంచి స్పందన వచ్చి తెలిసి సంతోషంగా ఉంది. తారక్, రామ్ చరణ్, మాస్ట్రో రాజమౌళికి అభినందనలు. మంచి సినిమాను అందించిన యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్. ఈ వారంలోనే ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడబోతున్నాను’ అంటూ ట్వీట్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. రీసెంట్ గా లోకేష్ భీమ్లా నాయక్ మూవీ ఫై ట్వీట్ చేయడంతో అప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయనపై విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీపై స్పందించడం.. తారక్‌ను అభినందించడంతో వాళ్లంతా పాజిటివ్‌గా రిప్లైలు ఇస్తున్నారు.