ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ఎట్టకేలకు శ్రీరెడ్డి విషయం పై స్పందించాడు . అసలు నాకు సినిమా రంగం పట్ల పూర్తి అవగాహనా లేదని అయినా శ్రీరెడ్డి తన సమస్య పట్ల స్పందిస్తే దానికి నన్ను బాధ్యుడ్ని చేయడం దారుణమని…. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పటికి కూడా గౌరవం ఉందని కానీ నేను కొన్ని మీడియా సంస్థలకు డబ్బులు ఇచ్చి శ్రీరెడ్డి చేత ఆరోపణలు చేయించానని చెప్పడం సరైంది కాదని హితువు పలికాడు .
పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే . నారా లోకేష్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడని , అంతేకాకుండా నాపై కక్ష్య కట్టి టివి 9 , టివి 5 , ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానళ్లలో నాకు వ్యతిరేకంగా వార్తలు వచ్చేలా చేసాడని ఆరోపణలు చేసాడు . ఆ ఆరోపణలపై నారా లోకేష్ ఇన్నాళ్లకు స్పందించాడు . ఇక శ్రీరెడ్డి చేత పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడించాల్సిన అవసరం నాకు లేదని ….. ఇకనైనా నాపై చేసిన ఆరోపణలకు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే బయట పెట్టాలని డిమాండ్ చేసాడు నారా లోకేష్ . పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇప్పటికి కూడా అభిమానమే అని ఇప్పటికైనా అతడి తప్పులేంటో తెలుసుకుంటే మంచిదని హితువు కూడా పలికాడు నారా లోకేష్ .