Homeటాప్ స్టోరీస్నన్ను దోచుకుందువటే రివ్యూ

నన్ను దోచుకుందువటే రివ్యూ

nannu dochukunduvate movie reviewనన్ను దోచుకుందువటే రివ్యూ :
నటీనటులు : సుధీర్ బాబు , నభా నటేష్ , నాజర్
సంగీతం : అజనీష్ లోక్ నాధ్
నిర్మాత : సుధీర్ బాబు
దర్శకత్వం : ఆర్ ఎస్ నాయుడు
రేటింగ్ : 3 / 5
రిలీజ్ డేట్ : 21 సెప్టెంబర్ 2018

యువహీరో సుధీర్ బాబు నటుడిగా తనకంటూ ప్రత్యేకతని సొంతం చేసుకున్నాడు . అయితే హీరోగా నటిస్తూనే సొంత బ్యానర్ ని స్థాపించి నన్ను దోచుకుందువటే చిత్రాన్ని నిర్మించాడు . ఆర్ ఎస్ నాయుడు అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ నిర్మించిన ఈ చిత్రంతో హీరోగా , నిర్మాతగా విజయం సాధించాడా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .

కథ :

- Advertisement -

అమెరికా వెళ్లి అద్భుత విజయాలను సాధించాలని తపనపడే వ్యక్తి కార్తీక్ ( సుధీర్ బాబు ) . అయితే కార్తీక్ ఇంట్లో వాళ్ళు మాత్రం అతడికి పెళ్లి చేయాలనీ చూస్తుంటారు దాంతో వాళ్ళ నుండి తప్పించుకోవడానికి షార్ట్ ఫిలిం హీరోయిన్ మేఘన ( నభా నటేష్ )ని ప్రేమిస్తున్నానని చెబుతాడు . మేఘన తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది . ఇక ప్రేమ కథ సుఖాంతం అవుతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా మేఘనని దూరం పెడతాడు కార్తీక్ . అసలు కార్తీక్ మేఘనని ఎందుకు దూరం పెట్టాడు ? అమెరికా వెళ్లాలన్న కార్తీక్ సంకల్పం ఏమయ్యింది ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

సుధీర్ బాబు నటన
నభా నటేష్ పెర్ఫార్మెన్స్
ఫస్టాఫ్
రొమాంటిక్ ఎంటర్ టైనర్

డ్రా బ్యాక్స్ :

సెకండాఫ్ స్లో నెరేషన్

నటీనటుల ప్రతిభ :

ఈ సినిమాకు హైలెట్ నభా నటేష్ గ్లామర్ అలాగే పెర్ఫార్మెన్స్ . చలాకీగా అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందింది . థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో మేఘన పాత్రకు పరిపూర్ణ న్యాయం చేసి యువతని విపరీతంగా ఆకట్టుకుంది నభా నటేష్ . ఇక సుధీర్ బాబు కూడా కార్తీక్ పాత్రలో అద్భుతంగా నటించాడు . వర్క్ మైండెడ్ ఎంప్లాయ్ గా , లవర్ గా ప్రేక్షకులను అలరించాడు సుధీర్ బాబు . నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మారి ధైర్యం చేసాడు , నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు . ఇక మిగిలిన పాత్రల్లో నాజర్ , తులసి , హర్ష , సుదర్శన్ తదితరులంతా తమతమ పాత్రల పరిధిమేరకు బాగా నటించారు .

సాంకేతిక వర్గం :

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు అయినప్పటికీ , మహేష్ బాబుకి బావ అయినప్పటికీ సుధీర్ బాబుకి సొంతంగా తన ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవాలనే ఆరాటం ఉన్న వ్యక్తి , వ్యక్తిత్వం ఉన్న వ్యక్తీ దాంతో చిత్ర నిర్మాణం చేపట్టి కసిగా రంగంలోకి దిగాడు . తన మార్క్ నిర్మాణాన్ని చూపించాడు , తొలిప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నాడు . ఇక దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు విషయానికి వస్తే ….. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించడంలో బాగానే రాణించాడు . అయితే ఫస్టాఫ్ ని బాగానే హ్యాండిల్ చేసిన నాయుడు సెకండాఫ్ కు వచ్చేసరికి కొంత తేలిపోయాడు . సెకండాఫ్ ని కూడా మరింతగా రక్తి కట్టించి ఉంటే పెద్ద విజయం సాధించేది నను దోచుకుందువటే ! . సెకండాఫ్ లో కొంత ట్రిమ్ చేస్తే బాగుంటుంది .

ఓవరాల్ గా :

యువతని ఆకట్టుకునే ఫ్రెష్ లవ్ స్టోరీ నన్ను దోచుకుందువటే

English Title: nannu dochukunduvate movie review

                                 Click here for English Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All