Homeటాప్ స్టోరీస్`ట‌క్ జ‌గ‌దీష్`‌.. నాని వైలెంట్ అవ‌తారం!

`ట‌క్ జ‌గ‌దీష్`‌.. నాని వైలెంట్ అవ‌తారం!

`ట‌క్ జ‌గ‌దీష్`‌.. నాని వైలెంట్ అవ‌తారం!
`ట‌క్ జ‌గ‌దీష్`‌.. నాని వైలెంట్ అవ‌తారం!

నేచుర‌ల్ స్టార్ నాని మ‌ళ్లీ స్పీడు పెంచారు. వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ మాంచి జోరుమీదున్నారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌`. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఐశ్వ‌ర్యా రాజేష్‌, రీతు వ‌ర్మ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రీలుక్ పోస్ట‌ర్‌ని మేక‌ర్స్ ఇటీవ‌ల విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని చిత్ర బృందం శుక్ర‌వారం విడుద‌ల చేసింది.

అన్ని ర‌కాల వంట‌కాల‌ని వ‌డ్డించిన అరిటాకు విస్త‌రి ముందు కూర్చున్న నాని కోపంగా ఎవ‌రినో చూస్తూ క‌త్తిదూస్తున్న స్టిల్ ఆక‌ట్టుకుంటోంది.  ఇందులో నాని పాత్ర పేరు జ‌గ‌దీష్ నాయుడు.. అంతా ట‌క్ జ‌గ‌దీష్ అంటుంటార‌ట‌. ఊరు భూదేవి పురం. స్టైల్‌గా ట‌క్‌చేసుకుని ఫార్మ‌ల్ డ్రెస్‌లో క‌నిపిస్తున్న నాని వైలెంట్ అవ‌తారం వెన‌కున్న క‌థేంట‌న్న‌ది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

- Advertisement -

శుక్ర‌వారం ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా రిలీజ్ చేసిన హీరో నాని ఈ సారి ఫుల్ మీల్స్ అంటూ ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. నాని న‌టిస్తున్న 25వ చిత్రం `వి` ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో 26వ చిత్రంరంగా రూపొందుతున్న `ట‌క్ జ‌గ‌దీష్‌`పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. `నిన్న‌కోరి` కాంబినేష‌న్ కావ‌డంతో ఆ అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. కాగా ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది  ఏప్రిల్‌లో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All