Homeటాప్ స్టోరీస్నాని చిత్రం తమిళంలో రీమేక్ ?

నాని చిత్రం తమిళంలో రీమేక్ ?

Ninnu kori
Ninnu kori

నాని – నివేదా థామస్ నటించిన నిన్ను కోరి చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది . నాని పాత్రలో అధర్వ నటిస్తుండగా నివేదా థామస్ పాత్రలో అనుపమా పరమేశ్వరన్ నటిస్తోంది . ఇక ఆది పినిశెట్టి పాత్రలో ఎవరు నటించనున్నారు అన్నది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు , వీలయితే ఆ పాత్రని ఆది పినిశెట్టి నే చేయాలనీ కోరనున్నారట ! ఆది ఒప్పుకోకపోతే అప్పుడు మరొకరిని ఎంపిక చేసే పనిలో పడతారట .

నాని – నివేదా థామస్ జంటగా మొదట జెంటిల్ మెన్ చిత్రంలో నటించారు . అది మంచి హిట్ కావడంతో నిన్ను కోరి చిత్రంలో రిపీట్ చేసారు ఆ కాంబినేషన్ ని . శివ నిర్వాణ దర్శకత్వంలో నిన్ను కోరి తెరకెక్కగా తమిళంలో మాత్రం కన్నన్ దర్శకత్వం వహిస్తున్నాడు . తెలుగులో మాదిరిగా తమిళంలో హిట్ అవుతుందా చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All