Monday, October 3, 2022
Homeటాప్ స్టోరీస్ప్రస్తుతం ఓటిటి రిలీజ్ కు మించి మరో మార్గం లేదు: నాని

ప్రస్తుతం ఓటిటి రిలీజ్ కు మించి మరో మార్గం లేదు: నాని

ప్రస్తుతం ఓటిటి రిలీజ్ కు మించి మరో మార్గం లేదు: నాని
ప్రస్తుతం ఓటిటి రిలీజ్ కు మించి మరో మార్గం లేదు: నాని

న్యాచురల్ స్టార్ నానిపై ఇటీవలే వివాదం నడిచిన విషయం తెల్సిందే. థియేటర్స్ లో కాకుండా ఓటిటిలో చిత్రాన్ని విడుదల చేయడమేంటి అని, అది కూడా పండగ పూటా చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ లకు పోటీగా దింపడం ఏంటి అని డిస్ట్రిబ్యూటర్లు ప్రశ్నించారు. ఏదైతేనేం మొత్తానికి నాని చిత్రం టక్ జగదీష్ సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

- Advertisement -

ఒక సాలిడ్ ఫ్యామిలీ చిత్రం చేశామని, ఈ చిత్ర రిసెప్షన్ పై తాను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు నాని ఇంటర్వ్యూలో తెలిపాడు. టక్ జగదీష్ ను కచ్చితంగా థియేటర్స్ లో విడుదల చేయాలనుకున్నాం. ఏ నటుడైనా, దర్శకుడైనా, ఇంకెవరైనా కానీ తన చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ మీదే చూడాలని అనుకుంటారు కానీ బయట పరిస్థితి బాలేదు. తెలుగు సినిమాకు పెద్ద మార్కెట్ అయిన యూఎస్ లో కేసులు పెరుగుతున్నాయి. నైట్ కర్ఫ్యూ ఇంకా ఆంధ్రప్రదేశ్ లో అమల్లోనే ఉంది. కరోనా విషయంలో సందిగ్దత అలానే ఉంది. ఈ నేపథ్యంలో ఓటిటి రిలీజ్ తప్ప మరో మార్గం లేదు.

అమెజాన్ ప్రైమ్ వంటి ప్లాట్ ఫామ్ ద్వారా సినిమా రిలీజ్ కావడం అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఆ ప్లాట్ ఫామ్ ద్వారా దాదాపు 200 దేశాల్లో యాక్సిస్ ఉంటుంది అని నాని తెలిపాడు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts