Homeఎక్స్ క్లూసివ్జెర్సీ టీజర్ టాక్

జెర్సీ టీజర్ టాక్

Nani' s Jersey teaser talk నాని హీరోగా నటించిన జెర్సీ టీజర్ నిన్న సాయంత్రం విడుదల అయ్యింది . మళ్ళీ రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తోంది . క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై నాని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . నాని నటించిన రెండు చిత్రాలు వరుసగా దెబ్బ కొట్టాయి దాంతో సక్సెస్ తప్పనిసరి అయ్యింది ఈ హీరోకు . అందుకే కస్టపడి మరీ సత్తా చాటే పనిలో పడ్డాడు నాని .

కృష్ణార్జున యుద్ధం , దేవదాస్ చిత్రాలు ప్లాప్ కావడంతో జెర్సీ పై ఆశాజనకంగా ఉన్నాడు నాని . క్రికెటర్ గా నాని సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు . తాజాగా రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేలాగే ఉంది . క్రీడలో నేపథ్యంలో తెలుగులో వచ్చిన చిత్రాలు దాదాపుగా విజయం సాధించాయి . కాగా ఆ కోవలో జెర్సీ కూడా చేరడం ఖాయమని అంటున్నారు . అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కన్నడ హీరోయిన్ శ్రద్ధ  శ్రీనాథ్ నాని నటించింది .

- Advertisement -

English Title: Nani’ s Jersey teaser talk

YouTube video

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All