Homeటాప్ స్టోరీస్పవన్ స్పీచ్ పై స్పందించిన హీరో నాని..!

పవన్ స్పీచ్ పై స్పందించిన హీరో నాని..!

Nani Response after Pawan Targets AP Government
 

రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడిన తీరు అందరిని సర్ ప్రైజ్ చేసింది. జనసేన అధినేతగా వైసీపీని టార్గెట్ చేస్తూ పవన్ స్పీచ్ సాగింది. తను నటించిన వకీల్ సాబ్ విషయంలో ఏపీ ప్రభుత్వం చేసిన కుట్ర.. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమ మీద చూపిస్తున్న అక్కసుని పవన్ కడిగిపడేశాడు. ఈ క్రమంలో స్పీచ్ మధ్యలో కొందరు హీరోల ప్రస్థావన తెచ్చాడు పవన్ కళ్యాణ్.

ముఖ్యంగా నాని సినిమా ఓటీటీలో రిలీజ్ అవడంపై ఆ టైంలో ఎగ్జిబిటర్లు నానిపై ఫైర్ అవడంపై స్పందించారు పవన్. అందులో అతని తప్పేమి లేదని అన్నారు పవన్. ఇక నిన్న తన ప్రస్థావన తెచ్చి ఇండస్ట్రీ తరపున మాట్లాడినందుకు నాని పవన్ స్పీచ్ పై తన స్పందన తెలియచేశారు. ఏపి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ సర్ కి ఉన్న డిఫరెన్సెస్ పక్కన పెడితే.. పవన్ సర్ జెన్యూన్ గా ఇండస్ట్రీ సమస్యలను ప్రస్థావించారు థ్యాంక్ యు సర్ అని అన్నారు నాని.

- Advertisement -

ఇక మరో ట్వీట్ లో సిని పరిశ్రమ వ్యక్తిగా సి.ఎం వైఎస్ జగన్ గారు సంబందిత మంత్రులు పరిశ్రమ సంస్యలను పరిష్కరించాలని కోరారు. పవన్ తర్వాత ఈ ఇష్యూపై స్పందించిన మొదటి హీరోగా నాని నిలిచాడు.

 

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All