
నేచురల్ స్టార్ నాని మినిస్టర్ వైట్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. సౌతిండియాలో నెంబర్ వన్ దుస్తుల బ్రాండ్‌గా పేరుగాంచిన దీనికోసం నాని ప్రచారం చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే నాని ఈ బ్రాండ్ కమర్షియల్ యాడ్ ను విడుదల చేసారు. ఈ యాడ్ లో నాని సంప్రదాయ వస్త్రాలు ధరించి, పొడవాటి జుట్టు, గుబురు గడ్డం మీసాలతో కొత్తగా కనిపించారు. ‘నేచురాలిటీకి ఐడెంటిటీ మన నాని.. అలాగే ఇక నుంచి ట్రెడిషనల్ ఐడెంటిటీకి మినిస్టర్ వైట్’ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఈ యాడ్ ను ఫేమస్ యాడ్ డైరెక్టర్స్ శంకర్ – గుణ ఈ కమర్షియల్ యాడ్ కు దర్శకత్వం వహించారు.
- Advertisement -