
మన పక్కింటి కుర్రాడిలా నటిస్తూ నాచురల్ స్టార్ గా స్క్రీన్ నేమ్ తెచ్చుకున్న నాని తను కూడా స్టార్ అని నిరూపించుకోవడానికి పెద్ద ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం చేస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని డ్యుయల్ రోల్ లో నటిస్తున్నాడు. సినిమా నాని కెరియర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో వస్తుందని తెలుస్తుంది.
ఈ సినిమాతో నాని తన ఇమేజ్ మార్చుకోవాలని చూస్తున్నాడు. ఎప్పుడూ మీడియం బడ్జెట్ సినిమాలతో సరదా సరదా సినిమాలు చేసే నాని ఈసారి కొత్తగా ఒక సబ్జెక్ట్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నాడు. రాహుల్ సంకృత్యన్ చెప్పిన కథ నచ్చి తన ఇమేజ్ మార్చుకునేందుకు ఇదే పర్ఫెక్ట్ సినిమా అనుకున్నాడు నాని. సినిమాలో రెండు పాత్రల్లో రెండు డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తున్నాడు.
తప్పకుండా నానికి శ్యామ్ సింగ రాయ్ తో నెక్స్ట్ లెవల్ క్రేజ్ వస్తుందని అనుకోవచ్చు. టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా నాని ఈసారి బాక్సాఫీస్ కుమ్మేయడం పక్కా అని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు.