
నేచురల్ స్టార్ నాని.. రీసెంట్ గా శ్యామ్ సింగ రాయ్ మూవీ తో సూపర్ హిట్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ జోష్ లోనే తదుపరి చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే అంటే సుందరానికి మూవీ పూర్తి చేసిన నాని..ప్రస్తుతం దసరా అనే మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర నాన్-థియేట్రికల్ డీల్‌ను పూర్తి చేశారు. “దసరా” నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ రూ.45 కోట్లు రాబట్టారు. ఈ ధర నాని సినిమాల్లో రికార్డ్ అని చెపుతున్నారు.
ఈ మూవీ లో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గోదావరి ఖనిలోని బొగ్గు గనుల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. అలాగే ఈ మూవీ లో ఇతర ప్రధాన పాత్రలను సముద్రఖని, సాయి కుమార్, జరినా పోషించనున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.