Homeటాప్ స్టోరీస్నాని ‘దసరా’ మూవీ ప్రారంభం

నాని ‘దసరా’ మూవీ ప్రారంభం

నాని ‘దసరా’ మూవీ ప్రారంభం
నాని ‘దసరా’ మూవీ ప్రారంభం

నేచురల్ స్టార్ నాని రీసెంట్ గా శ్యామ్ సింగ రాయ్ మూవీ తో సూపర్ హిట్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ జోష్ లోనే తదుపరి చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే అంటే సుందరానికి మూవీ పూర్తి చేసిన నాని.

ఈరోజు బుధువారం  ‘దసరా’ మూవీకి పూజా కార్య క్రమాలు పూర్తి చేసాడు. ఈ మూవీ లో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గోదావరి ఖనిలోని బొగ్గు గనుల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం.

- Advertisement -

మార్చి నుండి చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను సముద్రఖని, సాయి కుమార్, జరినా పోషించనున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All