
నేచురల్ స్టార్ నాని కూడా మొదలుపెట్టాడు. గత ఏడు నెలలుగా ఆగిపోయిన తన సినిమా షూటింగ్‌ని బుధవారం నుంచి ప్రారంభించేశాడు. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం `టక్ జగదీష్`. రారనికి `నిన్ను కోరి` వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మార్చిలో ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ ఎట్టకేలకు మొదలైంది.
ఈ విషయాన్ని స్వయంగా హీరో నాని సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా వెల్లడించారు. సోషల్ మీడియాలో మాస్క్ పట్టుకుని సెట్లో నిలుచున్న ఓ ఫొటోని షేర్ చేసిన నాని `జగదీష్ జాయన్ అయ్యాడు.. టక్ మొదలైంది` అంటూ కామెంట్ చేశారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `పెళ్లి చూపులు` ఫేమ్ రితూ వర్మ, ఐశ్వర్యారాజేష్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.
తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ముందు అనుకున్న ప్రకారం జూలై 3న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా వైరస్ కారణంగా రిలీజ్ ప్లాన్ మొత్తం మారిపోయింది. దీంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం పరిస్థితుల్ని బట్టి రిలీజ్ డేట్‌ని వచ్చే ఏడాదికి మార్చి నట్టు తెలిసింది.