
ఆనంద్ కృష్ణన్ (నందు) నటిస్తున్న తాజా చిత్రం `బొమ్మ బ్లాక్ బస్టర్`. రష్మీ గౌతమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. విజయీభవ ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రవీణ్ పగడాల, బోస్ నిడిమోలు, ఆనంద్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి ఈడా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ లుక్, మోషన్ పోస్టర్‌ని చిత్ర బృందం ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది.
ఈ చిత్రం ద్వారా విరాఠ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
తాజాగా ఈ మూవీ టీజర్‌ని రిలీజ్ చేశారు. స్టేజ్ నాటకాలు వేసుకునే యువకుడిగా స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అభిమానిగా పోతురాజు పాత్రలో నందు కనిపించబోతున్నాడు. నందు గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ మూవీ వుండబోతున్నట్టు టీజర్ ని బట్టి చూస్తే అర్థమవుతోంది. రష్మీగౌతమ్ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ ఏర్పడింది.
ఈ చిత్రం షూటింగ్‌తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోందని ఊహకందని ట్విస్ట్‌లు, మలుపులతో సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని, ఖచ్చితంగా నందుకు బ్రేక్‌నిస్తుందని గట్టి నమ్మకంతో వున్నామని చిత్ర నిర్మాతలు ప్రవీణ్ పగడాల, బోస్ నిడిమోలు, ఆనంద్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి యెడా తెలిపారు. లహరి మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో రిలీజ్ కానుంది.
