Homeటాప్ స్టోరీస్వైజయంతికి రెండు సినిమాల డీల్ సైన్ చేసిన నందిని రెడ్డి

వైజయంతికి రెండు సినిమాల డీల్ సైన్ చేసిన నందిని రెడ్డి

వైజయంతికి రెండు సినిమాల డీల్ సైన్ చేసిన నందిని రెడ్డి
వైజయంతికి రెండు సినిమాల డీల్ సైన్ చేసిన నందిని రెడ్డి

ఓ బేబీ చిత్రంతో మంచి విజయం దక్కించుకున్న నందిని రెడ్డి తన నెక్స్ట్ సినిమా కోసం రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుంది. ఈ రెండేళ్లలో ఆహా కోసం పలు షోస్ ను డైరెక్ట్ చేసింది. సమంత హోస్ట్ గా వచ్చిన సామ్ జామ్ షో ను నందిని రెడ్డి డైరెక్ట్ చేయడం విశేషం. ఇక ప్రస్తుతం ఈ మహిళా దర్శకురాలు వరసగా సినిమాలను లైన్లో పెట్టింది.

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం నందిని రెడ్డి టాప్ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో రెండు సినిమాలను సైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ముందుగా నాగ చైతన్య హీరోగా సినిమాను తెరకెక్కిద్దాం అనుకున్నారు కానీ నాగ చైతన్య ప్రస్తుతం చాలా బిజీ. ఈ నేపథ్యంలో ముందుగా సంతోష్ శోభన్ తో సినిమాను సెట్ చేసింది.

- Advertisement -

ఈ చిత్రం పూర్తయ్యాక నాగ చైతన్యతో సినిమా ఉంటుంది. ఈ రెండు చిత్రాలు కూడా రొమాంటిక్ ఎంటెర్టైనెర్స్ అని సమాచారం. మిగతా వివరాలు త్వరలోనే తెలిసే అవకాశముంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All