Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ హౌజ్ నుండి ఆ భామ ఔట్

బిగ్ బాస్ హౌజ్ నుండి ఆ భామ ఔట్

nandini out from bigg boss 2 houseబిగ్ బాస్ 2 హౌజ్ నుండి నందిని ఎలిమినేట్ అయ్యిందని ప్రచారం సాగుతోంది . టివిలో టెలికాస్ట్ అయ్యేది ఆలస్యంగా అయితే అంతకంటే ముందే ఎలిమినేట్ అవుతారు కాబట్టి నందిని బిగ్ బాస్ హౌజ్ నుండి అవుట్ అయినట్లు సమాచారం . నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 ఆసక్తికరంగా సాగుతోంది అయితే మొదటి సీజన్ లా సూపర్ హిట్ మాత్రం కాలేదు ఈ షో . ఇప్పటికే పలువురు షో నుండి ఎలిమినేట్ కాగా ఎలిమినేట్ అయిన యాంకర్ శ్యామల , నూతన్ నాయుడు లు మళ్ళీ హౌజ్ లోకి ఎంటర్ అయ్యారు .

ఇక ఈవారం అంటే ఈరోజున ఎలిమినేషన్ ఉంది కాగా అందులో భాగంగా నందిని హౌజ్ నుండి వెళ్లిపోయినట్లు తెలుస్తుండగా , గణేష్ అనే కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయ్యే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది . ఈరోజు ఆదివారం కావడంతో మరి కొద్దిసేపట్లోనే ఎవరు ఎలిమినేట్ అయ్యారనే విషయం తెలియనుంది . ఎలిమినేషన్ విషయాన్ని పక్కన పెడితే నాని ని కౌశల్ ఆర్మీ విపరీతంగా టార్గెట్ చేస్తోంది సోషల్ మీడియాలో . కౌశల్ కున్న ఫాలోయింగ్ చూసి నాని కుళ్ళుకుంటున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు కౌశల్ ఆర్మీ . మరి వాళ్ళ ఆరోపణలకు నాని ఎలా స్పందిస్తాడో చూడాలి .

- Advertisement -

English Title: nandini out from bigg boss 2 house

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All