Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య కొడుకు

ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య కొడుకు

nandamuri mokshagna in ntr biopicనటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎన్టీఆర్ బయోపిక్ లో నటించనున్నట్లు తెలుస్తోంది . మహానటుడు ఎన్టీఆర్ యుక్త వయసు పాత్రని మోక్షజ్ఞ చేత చేయించాలని భావిస్తున్నాడట దర్శకులు క్రిష్ . మోక్షజ్ఞ ని 2017 లోనే హీరోగా పరిచయం చేయాలనీ అనుకున్నాడు బాలయ్య అయితే ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడు బాలయ్య . కట్ చేస్తే ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమని అంటున్నారు .

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ” గౌతమిపుత్ర శాతకర్ణి ” చిత్రంలోనే మోక్షజ్ఞ ని నటింపజేయాలని అనుకున్నారు కానీ కుదరలేదు కట్ చేస్తే ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకుడు క్రిష్ కాబట్టి ఈసారి అయినా నిజం అవుతుందా ? మోక్షజ్ఞ ఎన్టీఆర్ బయోపిక్ లో ఎంట్రీ ఇస్తాడా ? చూడాలి .

- Advertisement -

మోక్షజ్ఞ ప్రస్తుతం చాలా లావుగా ఉన్నాడు దాంతో మూడు నెలల్లో ఒళ్ళు తగ్గించాలని చెప్పాడట క్రిష్ , దాంతో లావు తగ్గే ప్రయత్నం చేస్తున్నాడట . ఒకవేళ మోక్షజ్ఞ ఎన్టీఆర్ బయోపిక్ లో నటించడం నిజమే అయితే నందమూరి అభిమానులకు పండగే పండగ .

English Title: nandamuri mokshagna in ntr biopic

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All