
కరోనా వైరస్ ప్రతీ రంగాన్ని ఆడుకుంటోంది. ఏ ఒక్కరినీ విడిచి పెట్టడం లేదు. రిచ్, పూర్ అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరికీ పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. కరోనా దెబ్బతో కీలక రంగాలన్నీ కుదేలైపోతున్నాయి. ఏ రంగంలోనూ నష్టాలు లేవన్న మాట వినిపించడం లేదు. దీని వల్ల లక్షల మంది సర్వం కోల్పోతున్నారు కూడా. ఇక సినిమా వాళ్ల పరిస్థితి మరీ దుర్భరంగా మారింది. కరోనా వైరస్ ప్రబలడానికి ముందు హీరో నందమూరి కల్యాణ్‌రామ్ సినిమా మొదలైంది.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా `ఢీ` నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు మల్లిడి వేణు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పిరియాడిక్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం సైలెంట్‌గా రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. కల్యాణ్‌రామ్ ఈ చిత్రంలో రాజుగా కనిపించనున్నారు. అందు కోసం భారీగా గడ్డం కూడా పెంచిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఓ రాజమహల్ తరహాలో భారీ సెట్‌ని రెండు కోట్ల భారీ వ్యయంతో నిర్మించారు. ఇందులో కొన్ని కీలక ఘట్టాల్ని చిత్రీకరించారు కూడా.
`తుగ్లక్` అనే టైటిల్‌తో మల్లిడి వేణు రూపొందిస్తున్న ఈ చిత్రం కరోనా కారణంగా ఆగిపోయింది. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో షూటింగ్‌లన్నీ ఆపేసిన విషయం తెలిసిందే. మళ్లీ షూటింగ్‌లు ఎప్పుడు మొదలు పెడతారన్న దానిపై క్లారిటీ లేకపోవడంతో రెండు కోట్ల ఖర్చుతో వేసిన సెట్‌కు అద్దె కట్టడం ఎందుకని భావించి సెట్‌ని తీసేశారట. దీంతో కల్యాణ్‌రామ్‌కు రెండు కోట్లు నష్టం ఏర్పడినట్టు తెలిసింది. కరోనా తీవ్రత తగ్గిన తరువాతే మళ్లీ సెట్‌ని నిర్మించి షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు చిత్ర వర్గాల్లో వినిపిస్తోంది.