చరణ్ రంగస్థలం సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుండటంతో మంచి గా ఆడుతున్న సినిమాలను కూడా లేపేస్తున్నారు బయ్యర్లు . నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎం ఎల్ ఏ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది , పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్ కు అంతటి హిట్ నిచ్చే సినిమా అని కూడా అన్నారు కట్ చేస్తే రంగస్థలం రాకతో ఎం ఎల్ ఏ చిత్రాన్ని చాలా థియేటర్ ల నుండి లేపేశారు . అలాగే నీది నాది ఓకే కథ అనే చిత్రానికి కూడా ఇదే పరిస్థితి వచ్చింది .
మంచిగా నడుస్తున్న సినిమాని తీసేయడంతో ఆ చిత్ర దర్శక నిర్మాతలు హీరోలు చెప్పుకోలేని బాధతో ఉన్నారు . బాగాలేని సినిమాలను తీసేయడంలో అర్ధం ఉంది కానీ బాగున్న సినిమాని కూడా తీసేస్తే ఎలా అని ఆగ్రహంగా ఉన్నారు . ఇది చరణ్ సినిమా వల్ల వాళ్లకు ఇబ్బంది కలిగింది కాబట్టి చరణ్ పట్ల కోపంగా ఉన్నారు అందుకే చరణ్ ఆ రెండు సినిమాల పట్ల విలన్ గా మారాడు . ఓవర్ సీస్ లోనే కాదు ఇక్కడ రెండు రాష్ట్రాలలో కూడా ఆ సినిమా ని లేపేశారు .