Homeటాప్ స్టోరీస్పోస్టర్ అదిరిపోయింది

పోస్టర్ అదిరిపోయింది

Nandamuri kalyan ram look in ntr biopicదసరా పండగని పురస్కరించుకొని ఎన్టీఆర్ బయోపిక్ నుండి నందమూరి కళ్యాణ్ రామ్ లుక్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం . నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి హరికృష్ణ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ లుక్ తో పాటుగా అద్భుతమైన కొటేషన్ కూడా వదిలారు దాంతో మరింత నిండుతనం వచ్చింది ఆ పోస్టర్ కు . నిజంగా బాలయ్య ఎన్టీఆర్ గా రాజసంగా కూర్చోగా కళ్యాణ్ రామ్ హరికృష్ణ లా వంగి ఏదో చెబుతున్న సన్నివేశంతో కూడిన పోస్టర్ అదిరిపోయింది అనే చెప్పాలి . విజయం మీది …….. విజయ సారధ్యం నాది …… నీడలా వెన్నంటి ఉంటా నాన్నగారూ ‘ అనే డైలాగ్ ని ఆ పోస్టర్ తో వదిలారు .

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే . ఎన్టీఆర్ కథానాయకుడు , ఎన్టీఆర్ మహానాయకుడు గా రూపొందుతున్న ఈ చిత్రాలను జనవరి 9 న , జనవరి 24 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . క్రిష్ దర్శకత్వంలో తెరేకేక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ రోజు రోజుకి అంచనాలు పెంచుకుంటూ పోతోంది . ఎన్టీఆర్ బయోపిక్ బాలయ్య కెరీర్ లోనే రికార్డ్ స్థాయి బిజినెస్ చేస్తోంది .

- Advertisement -

English Title: Nandamuri kalyan ram look in ntr biopic

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All