Homeటాప్ స్టోరీస్బాలయ్య కొత్త సినిమాకు ముహూర్తం కుదిరిందిగా!

బాలయ్య కొత్త సినిమాకు ముహూర్తం కుదిరిందిగా!

బాలయ్య కొత్త సినిమాకు ముహూర్తం కుదిరిందిగా!
బాలయ్య కొత్త సినిమాకు ముహూర్తం కుదిరిందిగా!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు. రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. బోయపాటి శ్రీను ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. దసరాకు ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రం తర్వాత నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయబోతోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుంది.

హీరోయిన్ గా ఎవరిని ఫైనల్ చేస్తున్నారు అన్నది తెలియలేదు కానీ క్రాక్ చిత్రంలో అందరినీ మెస్మరైజ్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన కీలక సమాచారం బయటకు వచ్చింది. అక్టోబర్ 1 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది.

- Advertisement -

మరోసారి గోపీచంద్ మలినేని పోలీస్ కథనే డీల్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రకటన జూన్ లో వెలువడింది. మరింత సమాచారం త్వరలోనే వచ్చే అవకాశముంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All