Homeగాసిప్స్మరోసారి బాలయ్య సినిమాకు 'జై బాలయ్య' కనెక్షన్

మరోసారి బాలయ్య సినిమాకు ‘జై బాలయ్య’ కనెక్షన్

మరోసారి బాలయ్య సినిమాకు 'జై బాలయ్య' కనెక్షన్
మరోసారి బాలయ్య సినిమాకు ‘జై బాలయ్య’ కనెక్షన్

నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ తో చేసిన పైసా వసూల్ కు ముందు జై బాలయ్య, తేడా సింగ్ అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా జై బాలయ్య టైటిల్ చాలా ఆసక్తికరంగా అనిపించింది. అయితే వివిధ కారణాల వల్ల పూరి పైసా వసూల్ కే మొగ్గు చూపాడు. నెమ్మదిగా జై బాలయ్య టైటిల్ కూడా సైడ్ అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ టైటిల్ వెలుగులోకి వచ్చింది.

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. కొన్ని నెలల క్రితం ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అవ్వగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. క్రాక్ వంటి సూపర్ హిట్ తర్వాత గోపీచంద్ చేస్తోన్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

- Advertisement -

తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ చిత్రానికి జై బాలయ్య టైటిల్ ను గోపీచంద్ కన్సిడర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈసారైనా ఈ టైటిల్ ను ఫిక్స్ చేస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి ఇంకా కాస్ట్ అండ్ క్రూ ను ఫైనల్ చేయాల్సి ఉంది.

బాలకృష్ణ రీసెంట్ గా అఖండ చిత్రాన్ని పూర్తి చేసి గోపీచంద్ మలినేనితో సినిమాకు సన్నద్ధమవుతున్నాడు. అలాగే ఆహా కోసం బాలయ్య టాక్ షో కూడా నిర్వహించనున్న విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All