Homeటాప్ స్టోరీస్కేసీఆర్ పై నిప్పులు చెరిగిన బాలయ్య

కేసీఆర్ పై నిప్పులు చెరిగిన బాలయ్య

Nandamuri Balakrishna fires on KCRనటసింహం నందమూరి బాలకృష్ణ తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పుల వర్షం కురిపించారు . తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కోసం రోడ్ షోలు చేపట్టారు బాలయ్య . సనత్ నగర్ , శేరిలింగం పల్లి లలో బాలయ్య ప్రచారం చేపట్టారు . కాగా మొన్న ఓ మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం పై కేసీఆర్ పై విమర్శలు చేసిన బాలయ్య నిన్న మాత్రం నిప్పుల వర్షం కురిపించాడు , నటసింహం అనిపించాడు . నిజంగా మీకు దమ్ముంటే హైటెక్ సిటీ ని మూయండి ,ఫ్లై ఓవర్ లను మూసేయండి అంత దమ్ముందా కేసీఆర్ ? అంటూ నేరుగా కేసీఆర్ ని ప్రశ్నించాడు .

హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రని ఎవరు కాదనలేని సత్యమని , చంద్రబాబుది ఒక చరిత్ర , ఆ చరిత్ర ని చెరిపేయ్యాలంటే హైటెక్ సిటీ ని , ఫ్లై ఓవర్ లను మూసేయండి అంటూ సవాల్ విసిరాడు అంతేకాదు చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తే హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందని …… గడీల రాజ్యం పోయి గరీబోళ్ల రాజ్యం తెచ్చింది తెలుగుదేశం పార్టీ అని కానీ ఇప్పుడు మళ్ళీ గడీల రాజ్యం వచ్చిందని కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు బాలయ్య . చంద్రబాబు ముద్ర ని తీసేయ్యాలంటే చంద్రబాబు తెచ్చిన అన్నింటినీ మూసెయ్యాలని సంచలన వ్యాఖ్యలు చేసాడు బాలయ్య .

- Advertisement -

English Title: Nandamuri Balakrishna fires on KCR

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All