Homeటాప్ స్టోరీస్కేసీఆర్ ని చెడుగుడు ఆడుకున్న బాలయ్య

కేసీఆర్ ని చెడుగుడు ఆడుకున్న బాలయ్య

Nandamuri Balakrishna fires on KCRనందమూరి బాలకృష్ణ మరోసారి కేసీఆర్ పై నిప్పులు చెరిగాడు . నిన్న హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తరుపున రోడ్ షోలు నిర్వహించిన బాలయ్య కేసీఆర్ పై పరుష పదజాలం వాడాడు . నీకు దమ్ముంటే రా ….. కేసీఆర్ ఆంధ్రాలో చూసుకుందాం ……. ఆంధ్రప్రదేశ్ దాకా ఎందుకు ఇక్కడే తెలంగాణ నడిబొడ్డున చూసుకుందాం అంటూ సవాల్ విసరడమే కాకుండా చంద్రబాబుది హిస్టరీ …… నీది లాటరీ అంటూ బాంబ్ లాంటి డైలాగ్స్ ని పేల్చి అభిమానులను , కార్యకర్తలను సంతోషంలో ముంచెత్తాడు .

గడ్డి అన్నారంలో ప్రచారం చేసిన బాలయ్య మరోసారి చంద్రబాబు గొప్పతనాన్ని చాటిచెబుతూ బాబు చరిత్ర ని తీసేయ్యాలంటే హైటెక్ సిటీ ని మూసెయ్యాలని ఆ దమ్ము కేసీఆర్ కు ఉందా ? ఫ్లై ఓవర్ లను మూసెయ్యాలని , శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ని మూసెయ్యాలని , ఔటర్ రింగ్ రోడ్డు ని మూసెయ్యాలని ఆ దమ్ము మీకుందా ? అంటూ సవాల్ విసిరాడు బాలయ్య . అలాగే తెలుగుదేశం పార్టీ తరుపున గెలిచి టీఆర్ఎస్ లో చేరిన వాళ్ళని కూడా చెడుగుడు ఆడుకున్నాడు బాలయ్య . ఇక బాలయ్య హిందీలో చేసిన ప్రసంగం తో నవ్వుల వర్షం కురిసింది .

- Advertisement -

English Title : Nandamuri Balakrishna fires on KCR

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All