Homeటాప్ స్టోరీస్మహేష్ హిందీ సినిమా చేయడం లేదట

మహేష్ హిందీ సినిమా చేయడం లేదట

namratha clarify on mahesh bollywood entry మహేష్ బాబు ముంబై లో ఉండేసరికి హిందీ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి , అంతేకాదు తెలుగులో డిజాస్టర్ అయిన స్పైడర్ చిత్రం రీమేక్ చేయనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి దాంతో మహేష్ అభిమానుల్లో భయం పట్టుకుంది ఎక్కడ ఆ చెత్త సినిమా రీమేక్ చేస్తాడేమో అని ! కట్ చేస్తే మహేష్ భార్య నమ్రత అవన్నీ గాలి వార్తలే అని కొట్టి పారేసింది . మహేష్ బాలీవుడ్ సినిమా కోసం ముంబై వెళ్ళలేదు , కేవలం కొత్త సినిమా కోసం ….. కొత్త లుక్ కోసం హెయిర్ స్టైలిస్ట్ ని కలవడానికి మాత్రమే ముంబై వెళ్లాం అంతేతప్ప బాలీవుడ్ సినిమా కోసం కాదు అని తేల్చి చెప్పింది నమ్రత .

ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించడానికి సమాయత్తం అవుతున్నాడు . అగ్ర నిర్మాతలు అశ్వనీదత్ – దిల్ రాజు లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . కాగా ఆ చిత్రం లోని లుక్ కోసం మహేష్ హెయిర్ స్టైల్ ని మారుస్తున్నాడు . ఇప్పటికే ఆ సినిమా కోసం గడ్డం , మీసం పెంచాడు మహేష్ . ఆ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All