Homeటాప్ స్టోరీస్మహేష్ బాబు న్యూ లుక్ ఇదిగో

మహేష్ బాబు న్యూ లుక్ ఇదిగో

namrata reveals mahesh new lookటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే . ఇటీవలే భరత్ అనే నేను చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్ బాబు వంశీ పైడిపల్లి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు . రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం మహేష్ బాబు గడ్డం , కోర మీసం పెంచుతున్నాడు . ఈరోజు మహేష్ కొత్త లుక్ ని సోషల్ మీడియాలో రివీల్ చేసింది మహేష్ భార్య నమ్రత .

పాత్ర కోసం ఎక్సర్ సైజ్ చేస్తున్న సమయంలో….. సితార తో సంతోషాన్ని పంచుకుంటున్న సమయంలో వెనక నుండి నమ్రత ఫోటో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . ఇంకేముంది మహేష్ న్యూ లుక్ వైరల్ అవుతోంది . మహేష్ బాబు పూర్తిగా కనిపించడం లేదు కానీ గడ్డం మాత్రం కనిపిస్తోంది . గుబురు గడ్డంతో పాటు కోర మీసం తో మహేష్ కనిపించనున్నాడు వంశీ పైడిపల్లి చిత్రంలో . మహేష్ బాబు కు ఈ సినిమా 25వది కావడం విశేషం . భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ తర్వాత రానున్న ఈ చిత్రం లో పూజా హెగ్డే మహేష్ సరసన నటించనుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All