Homeటాప్ స్టోరీస్“నాదీ నక్కిలేస్ గొలుసు...” రచ్చ మొదలు

“నాదీ నక్కిలేస్ గొలుసు…” రచ్చ మొదలు

“నాదీ నక్కిలేస్ గొలుసు...” రచ్చ మొదలు
“నాదీ నక్కిలేస్ గొలుసు…” రచ్చ మొదలు

ఇప్పటికే సంక్రాంతికి రిలీజ్ అయిన సిత్తరాల సిరపడు అనే ఉత్తరాంధ్ర గీతాన్ని జనాలు తమ గుండెల్లో పెట్టుకున్నారు. తాజాగా ఈ రోజు పొద్దునే రిలీజ్ అయిన మరో పాట ఆ ఒరవడిని కొనసాగించేలా ఉంది. కరుణ కుమార్ గారి దర్శకత్వంలో తమ్మారెడ్డి భరద్వాజ గారు సమర్పిస్తున్న పలాస – 1978 సినిమాలో ఒక హుషారైన జానపద గీతాన్ని మనముందుకు తెచ్చారు. “నీ పక్కన పడ్డాది లేదో సూడు పిల్లా… నాదీ నక్కిలేస్ గొలుసు…!” అనే ఉత్తరాంధ్ర జానపద గీతానికి సాంకేతిక మెరుగులు దిద్ది, తనదైన విలక్షనమైన గాత్రంతో ఆలపించారు రఘు కుంచె.

ఆయన ఈ సినిమాకు స్వరాలూ అందించడంతో పాటు, ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇక పాట చితీకరణకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా మనకు చూపించారు. ఈ పాటలో నటీనటులు, లైటింగ్, కాస్ట్యూమ్స్, కొరియోగ్రఫీ అన్నీ అదిరిపోయాయి. ఇక ఈ పాటను ఖచ్చితంగా ప్రేమికులు రిపీటెడ్ మోడ్ లో వినడంతో పాటు, కుర్రాళ్ళకు తమ గర్ల్ ఫ్రెండ్ ని సరదాగా ఆటపట్టించడానికి కావలసిన మెటీరియల్ మాదిరి ఈపాట ఉంది. ఈ సాంగ్ ను ప్రముఖ దర్శకులు సుకుమార్ గారు ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియచేసారు.

- Advertisement -

“మీ మామ గారు వచ్చేటి వేళా.. నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళా.. మీ మరిదిగారు వచ్చేటి వేళా.. నీకు మందారాలు తెచ్చే వేళా..” ఇలాంటి లిరిక్స్ యూత్ అంతా ఇప్పటికే హమ్ చెయ్యడం మొదలెట్టేసారు. ఎంతైనా మన మట్టి, మన బాష, మన యాస ఎప్పటికీ మన శ్వాస.. ఆ మ్యాజిక్కే వేరు..

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All