
కరోరా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత ఏడాది కాలంగా ప్రపంచాన్ని వణించిన ఈ మహమ్మారి ఇటీవల తగ్గు ముఖం పట్టిందని అనిపించినా మళ్లీ ఊహకందని స్థాయిలో పాజిలివ్ కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్‌లో భాగంగా మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో కరోనా తీవ్ర రూపం దాలుస్తోంది. ముంబైలో మరీ ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలని వణికిస్తోంది.
ఇటీవల కరోనా బారిన రణ్‌బీర్ కపూర్, అలియాభట్, పరేష్ రావల్, అక్షయ్‌కుమార్ కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిం్దే. టాలీవుడ్‌లోనూ దీని పరంపర కొనసాగుతోంది. నివేదా థామస్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మకు కరోనా వైరస్ సోకింది. ఇటీవల తను వ్యాక్సిన్ తొలి డోస్ వేసుకున్నా కోవిడ్ బారిన పడటం కలకలం రేపుతోంది.
ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా నగ్మ స్పందించారు. కొన్ని రోజుల క్రితం తొలి డోసు వ్యాక్సిన్ వేయించుకున్నాను. ఆయితే ఇటీవల చేసిన టెస్టుల్లో తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని నటి నగ్మ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం హోమ్ క్వారెంటైన్‌లో వున్నానని, దయచేసి వ్యాక్సిన్ వేసుకున్నాం కదా అని రిలాక్స్ కాకుండా జాగ్రత్తలు పాటించాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ అజాగ్రత్తగా వుండరాదని నగ్మ తెలిపింది.