Homeటాప్ స్టోరీస్నాగార్జున `వైల్డ్ డాగ్‌`  డిజిట‌ల్  రైట్స్ నెట్‌ఫ్లిక్స్‌కే!

నాగార్జున `వైల్డ్ డాగ్‌`  డిజిట‌ల్  రైట్స్ నెట్‌ఫ్లిక్స్‌కే!

నాగార్జున `వైల్డ్ డాగ్‌`  డిజిట‌ల్  రైట్స్ నెట్‌ఫ్లిక్స్‌కే!
నాగార్జున `వైల్డ్ డాగ్‌`  డిజిట‌ల్  రైట్స్ నెట్‌ఫ్లిక్స్‌కే!

కింగ్ నాగార్జున న‌టిస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `వైల్డ్ డా‌గ్`. అహిషోర్ సాల్మ‌న్ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2009లో హైద‌రాబాద్‌లో జ‌రిగిన వ‌రుస పేలుళ్ల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ‌

ఇటీవ‌లే షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఇదిలా వుంటే ఈ మూవీని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌డం లేద‌ని, ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో రిలీజ్ చేయ‌బోతున్నారంటూ గ‌త కొన్ని రోజులుగా వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ మూవీ డిజిట‌ల్ రైట్స్‌ని ప్ర‌ముఖ డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -

ఈ మూవీ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ 27 కోట్లు వెచ్చించి న‌ట్టు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ తెలుగులో బిగ్ మూవీకి ఈ స్థాయిలో భారీ ఆఫ‌ర్‌ని అందించ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం. ఇటీవ‌ల కీర్తిసురేష్ న‌టించిన `మిస్ ఇండియా` కూడా నెట్‌ఫ్లిక్స్ లో విడుద‌లైన విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All