Homeటాప్ స్టోరీస్బంగార్రాజు లైన్లో ఉన్నాడట

బంగార్రాజు లైన్లో ఉన్నాడట

nagarjunas bangarraju on cardsసోగ్గాడే చిన్ని నాయనా నాగార్జున కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచింది . 2015 లో సంక్రాంతి బరిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్ గా ” బంగార్రాజు ” తీయాలని అప్పుడే అనుకున్నారు అంతేకాదు ఫిలిం ఛాంబర్ లో బంగార్రాజు అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించాడు నాగార్జున . అయితే టైటిల్ రిజిస్టర్ చేయించాడు కానీ కథ మాత్రం కుదరలేదు దర్శకులు కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథ నాగార్జున కు నచ్చకపోవడంతో దాన్ని పక్కన పెట్టాడు .

మొదటి ప్రయత్నంలోనే సూపర్ డూపర్ హిట్ కొట్టిన కళ్యాణ్ కృష్ణ పట్టువదలని విక్రమార్కుడిలా బంగార్రాజు స్క్రిప్ట్ కి మెరుగులు పెడుతూనే ఉన్నాడట ! అయితే ఇటీవలే కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథ నాగ్ కు నచ్చడంతో తప్పకుండా చేద్దాం కాకపోతే ఫలానా వి కాస్త బెటర్ చేయి అని మార్పులు చెప్పాడట . ప్రస్తుతం నాగార్జున తన కమిట్ మెంట్స్ తో బిజీ గా ఉన్నాడు అలాగే కళ్యాణ్ కృష్ణ కూడా రవితేజ తో సినిమా చేస్తున్నాడు . అవి పూర్తయ్యాక ఈ బంగార్రాజు ఉండొచ్చు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All