Homeటాప్ స్టోరీస్`వైల్డ్ డాగ్‌` టీమ్‌కి టాటా చెప్పేసిన కింగ్ నాగార్జున

`వైల్డ్ డాగ్‌` టీమ్‌కి టాటా చెప్పేసిన కింగ్ నాగార్జున

`వైల్డ్ డాగ్‌` టీమ్‌కి టాటా చెప్పేసిన కింగ్ నాగార్జున
`వైల్డ్ డాగ్‌` టీమ్‌కి టాటా చెప్పేసిన కింగ్ నాగార్జున

అక్కినేని నాగార్జున న‌టిస్తున్న తాజా చిత్రం `వైల్డ్ డాగ్‌`. అహిషోర్ సాల్మ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్ లో 2009లో జ‌రిగిన వ‌రుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో నాగార్జున ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌గా న‌టిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన కీల‌క షెడ్యూల్ హిమాల‌యాల్లోని మ‌నాలీ కొండ‌ల్లో జ‌రుగుతోంది. 21 డేస్ పాటు జ‌రిగే ఈ షెడ్యూల్‌లో గ‌త రెండు వారాలుగా నాగ్ పాల్గొంటున్నారు. తాజాగా నాగ్‌కి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ పూర్తయింది. దీంతో నాగ్ మ‌నాలి నుంచి హైద‌రాబాద్ ప‌య‌న‌మ‌య్యారు. త‌న టాలెంటెడ్ టీమ్కు, హిమాల‌యాల‌కు వీడ్కోలు చెప్ప‌డం బాధ‌గా వుంద‌ని ఈ సంద‌ర్భంగా నాగార్జున అన్నారు.

- Advertisement -

‌శుక్ర‌వారం త‌రం ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా `వైల్డ్ డాగ్‌` షూటింగ్ సెట్‌లో త‌న స‌హ న‌టుల‌తో తీసుకున్న ఫొటోల్ని ఈ సంద‌ర్భంగా నాగార్జున షేర్ చేశారు. నాగ్ పోర్ష‌న్ పూర్త‌యినా మిగ‌తా టీమ్‌పై అక్క‌డ మ‌రిన్ని కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రిస్తున్నారు. య‌దార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో నాగ్‌కు జోడీగా దియా మీర్జా న‌టిస్తోంది. కీల‌క‌ పాత్ర‌లో స‌యామీ ఖేర్ న‌టిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All