
కింగ్ నాగార్జున నటిస్తున్న యాక్షన్ ఎడ్వెంచర్ `వైల్డ్ డాగ్`. 2009లో హైదరాబాద్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఈ చిత్రాన్ని అత్యంత రియలిస్టిక్‌గా తెరకెక్కిస్తున్నారు. అహిషోర్ సాల్మాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా దాదాపు ఏడు నెలల విరామం తరువాత ఈ మూవీ షూటింగ్ మొదలైంది.
ప్రస్తుతం హిమాలయాల్లో కీలక ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు. 21 డేస్ అక్కడి కొండల్లో.. కోనల్లో కీలక సన్నివేశాల్ని.. పోరాట ఘట్టాల్ని షూట్ చేస్తున్నారు. నాగ్‌తో పాటు బిగ్‌బాస్ ఫేమ్ అలీరెజా, సయామీ ఖేర్, మయాంక్ ప్రకాష్‌తో పాటు మరి కొంత మంది పాల్గొంటున్నారు. తాజాగా ఈ సన్నివేశాలకు సంబంధించిన ఆన్ లొకేషన్ ఫొటోలని పాగార్జున ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఏడు నెలల తరువాత ప్రకృతి అందాల నడుమ షూటింగ్ చేస్తుండటం ఆనందంగా వుందని ఈ సందర్‌భంగా నాగ్ ట్వీట్ చేశారు. ఇటవల హిమాలయ పర్వత పంక్లుల్లోని మనాలీ కొండల్లో విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియోని నాగ్ షేర్ చేసిన విషయం తెలిసిందే. రోహ్ తంగ్ పాస్ దగ్గర నడుస్తూ ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ నాగ్ పెట్టిన వీడియో వైరల్‌గా మారింది.
#WildDog with his team in the Himalayas!! Loving the freedom and loving nature ?@SaiyamiKher @ActorAliReza @mayankparakh19 @MatineeEnt pic.twitter.com/PtOsjf5Uj6
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 29, 2020