
కింగ్ నాగార్జున కులు మనాలి కొండల్లో హంగామా చేస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `వైల్డ్ డాగ్`. అహొషోర్ సలా్మన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏడు నెలల విరామం తరువాత ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది.
ఓ పక్క బిగ్‌బాస్ సీజన్ 4 ప్రోమోలో నటిస్తూనే నాగార్జున `వైల్డ్ డాగ్` సెట్లో సందడి చేశారు. తాజాగా ఈ మూవీ కోసం ఆయన మనాలి వెళ్లారు. అక్కడే కీలక ఘట్టాల చిత్రీకరణ జరగుతోంది. 21 డేస్ పాటు అక్కడ కీలక ఘట్టాల్ని షూట్ చేయబోతున్నారు. హైదరాబాద్‌లో 2009లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా మనాలీ కొండల్లో విహరిస్తున్న నాగ్ ఓ వీడియోని షేర్ చేశారు. మనాలీ సౌందర్యానికి పరవశించిపోయిన ఆయన అక్కడి అందాల గురించి ఆసక్తికరంగా వెల్లడించారు.
`హాయ్ .. ఇది రోహ్‌తంగ్ పాస్ (రోహ్‌తంగ్ కనుమ)లోని అందమైన ఉదయం. సముద్ర మట్టానికి మూడు వేల తొమ్మిది వందల ఎనభై మీటర్ల ఎత్తులో వున్న ప్రాంతం. అంటే పదమూడు వేల అడుగుల ఎత్తు. ఇది చాలా ప్రమాఆదకరమైన కనుమ. నవంబర్ నుంచి మే నెల వరకు దీన్ని మూసేస్తారు. `వైల్డ్ డాగ్` షూటింగ్ కోసం ఇక్కడకు వచ్చాం. ఈ మూవీ షూటింగ్ చాలా బాగా జరుగుతోంది. అందమైన పర్వతాలు, నీలాకాశం, జలపాతాలు.. ఇక్కడ వుండటం ఎంతో బాగుంది. ఏడు నెలల తరువాత ఇటు వంటి ప్లేస్‌కి రావడం చాలా ఆనందంగా వుంది. 21 రోజుల్లో షూటింగ్ పూర్తయిపోతుంది. ఆ తరువాత హైదరాబాద్ వచ్చేస్తాను. లవ్ యు ఆల్.. సీ యు` అన్నారు.