Homeటాప్ స్టోరీస్స్పెషల్ డే నాడు తన హీరోను గుర్తుచేసుకున్న నాగ్

స్పెషల్ డే నాడు తన హీరోను గుర్తుచేసుకున్న నాగ్

స్పెషల్ డే నాడు తన హీరోను గుర్తుచేసుకున్న నాగ్
స్పెషల్ డే నాడు తన హీరోను గుర్తుచేసుకున్న నాగ్

అక్కినేని నాగేశ్వర రావు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక లెజండ్. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన నటజీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఈరోజు ఏఎన్నార్ 98వ జయంతి. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున తన తండ్రి, హీరో, ఇన్స్పిరేషన్ అయిన నాగేశ్వర రావు గారి గురించి ఎమోషనల్ అయ్యారు.

“నాన్నకు పొందూరు ఖద్దర్ అంటే చాలా ఇష్టం. ఈరోజు అదే వేసుకున్నా. అలాగే నా చేతికి పెట్టుకున్న వాచ్ నాకన్నా కూడా సీనియర్. ఆయన ఫెవరెట్. ఇప్పుడు నా ఫెవరెట్. ఇప్పటికీ అది అలానే పనిచేస్తోంది. నా మెడలో వేసుకుంది ఆయన నవరత్నాల హారం. ఇది నవరత్నాల ఉంగరం. ఇవన్నీ వేసుకుంటే నాన్న గారు నాతోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఏదో తృప్తి. నాన్నగారి పంచెకట్టు అందాన్ని మీ ముందుకు తీసుకురావడం కోసమే మా ఈ చిన్ని ప్రయత్నం. ఏఎన్నార్ లివ్స్ ఆన్” అని వీడియోలో చెప్పాడు నాగార్జున.

- Advertisement -

ప్రస్తుతం నాగార్జున బంగార్రాజు చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. దీంతో పాటు బిగ్ బాస్ సీజన్ 5 కు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All