Homeటాప్ స్టోరీస్నాగార్జున చేతిలో మోసపోయిన సురేష్ బాబు

నాగార్జున చేతిలో మోసపోయిన సురేష్ బాబు

నాగార్జున చేతిలో మోసపోయిన సురేష్ బాబు
నాగార్జున చేతిలో మోసపోయిన సురేష్ బాబు

అగ్ర నిర్మాత సురేష్ బాబు ఆన్లైన్ మోసానికి గురయ్యారు. నాగార్జునరెడ్డి అనే వ్యక్తి తన వద్ద 500 కోవిడ్ వ్యాక్సిన్ లు ఉన్నాయని చెప్పి సురేష్ బాబును నమ్మించాడు. తన స్టాఫ్, వాళ్ళ కుటుంబ సభ్యులకు టీకాలు వేయించాలని తలపెట్టిన సురేష్ బాబు అవి కొనుగోలు చేయాలని నిశ్చయించుకున్నాడు.

అయితే తన భార్య అకౌంట్ కు 1 లక్ష రూపాయలు పంపమని ఆ తర్వాత మీ వద్దకు వ్యాక్సిన్ లు వస్తాయని చెప్పాడు. సురేష్ బాబు ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయగానే నాగార్జున రెడ్డి తన ఫోన్ ను స్విచాఫ్ చేసాడు. దీంతో సురేష్ బాబు తన సహాయకుడు ద్వారా పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసారు.

- Advertisement -

ఇది జరిగి నెల రోజులు అయింది. అదే నాగార్జున రెడ్డి మరో వ్యక్తిని కూడా ఇలా మోసం చేసాడు. కాగా ఇప్పుడు నాగార్జున రెడ్డి పోలీసులకు చిక్కాడు. రిమాండ్ విధించి సంగారెడ్డి జైలుకి అతణ్ణి తీసుకెళ్లారు. నాగార్జున రెడ్డి ఇలానే వ్యాక్సిన్ లు సప్లై చేస్తానని చెప్పి చాలా మందిని మోసం చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All