
కింగ్ అక్కినేని నాగార్జున రీసెంట్‌గా `వైల్డ్ డాగ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. థియేటర్లలో వరల్డ్ వైడ్‌గా విడుదలన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. తాజాగా ఈ మూవీని ఈ నెల 22న నెట్‌ప్లిక్స్‌లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ టాప్ ట్రెండింగ్‌లో వుంది. థియేటర్లలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ మూవీ నెటిజన్ లని కూడా విశేషంగా అలనిస్తోంది.
ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత మరో యాఓన్ థ్రిల్లర్‌ని ఇటీవలే ప్రారంభించారు నాగార్జున. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఈ మూవీ తరువాత వెంటనే `బంగార్రాజు`ని పట్టాలెక్కించబోతున్నారు. గత కొంత కాలంగా ఆలస్యమవుతూ వస్తున్న ఈ మూవీ స్క్రిప్ట్‌లో ఫైనల్ గా నాగార్జున మార్పులు చేస్తున్నారు. ఫైనల్ మార్పులు పూర్తయ్యాక ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు.
ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ `తన తదుపరి చిత్రం బంగ్రాజు ప్రారంభించబోతున్నానని, పరిస్థితి తిరిగి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. దర్శకుడు కల్యాణ కృష్ణతో చర్చలు జరుపుతున్నానని, స్క్రిప్ట్‌లో తుది మార్పులు చేస్తున్నానని నాగ్ తెలిపారు. `బంగారాజు` 2016లో వచ్చిన `సోగ్గాడే చిన్ని నాయన`కు సీక్వెల్‌గా రూపొందబోతోంది.