Homeటాప్ స్టోరీస్రాంగోపాల్ వర్మ పై నిప్పులు చెరుగుతున్న ఫ్యాన్స్

రాంగోపాల్ వర్మ పై నిప్పులు చెరుగుతున్న ఫ్యాన్స్

nagarjuna fans fire on ramgopal varma దర్శకులు రాంగోపాల్ వర్మ పై నాగార్జున అభిమానులతో పాటుగా ఆ సినిమాని చూసిన పలువురు ప్రేక్షకులు అతడి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . వాళ్ళ కోపం ఎంతగా ఉందంటే …… వర్మ ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు సోషల్ మీడియాలో . ఆఫీసర్ చిత్రాన్ని రాడ్ తో పోల్చుతూ చివరకు కొంతమంది నాగార్జున ని కూడా టార్గెట్ చేసారు . ఇక వర్మ నైతే కొట్టడమే తక్కువ అతడి పై బూతుల వర్షం కురిపిస్తున్నారు .

ఇంతకుముందు రాంగోపాల్ వర్మ – నాగార్జున కాంబినేషన్ లో శివ , అంతం , గోవిందా గోవింద చిత్రాలు రాగా అందులో శివ చిత్రం ప్రభంజనం సృష్టించింది , మిగతా చిత్రాలు ప్లాప్ అయ్యాయి . ఆ సినిమాల తర్వాత మళ్ళీ నాగార్జున – వర్మ ల కాంబినేషన్ లో సినిమా రాలేదు . ఇక వర్మ గతకొంత కాలంగా చేస్తున్న సినిమాలన్నీ ఉప్మా సినిమాల కంటే దారుణం దాంతో ఆఫీసర్ చిత్రం పై అంచనాలు లేకుండా పోయాయి . అంతేకాదు అసలు నాగార్జున వర్మ కు ఛాన్స్ ఇచ్చి తప్పు చేస్తున్నాడు అంటూ అప్పట్లోనే టాలీవుడ్ చెప్పింది . అంతేకాదు నాగార్జున అభిమానులు కూడా భయపడ్డారు కూడా ….. కట్ చేస్తే ఫ్యాన్స్ భయపడింది నిజమే అయ్యింది దాంతో వర్మ పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు , అతడ్ని తిడుతూ కోపాన్ని తగ్గించుకుంటున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All