Homeఎక్స్ క్లూసివ్నాగార్జున ,నాని ల సినిమా వచ్చే నెల నుండే

నాగార్జున ,నాని ల సినిమా వచ్చే నెల నుండే

కింగ్ నాగార్జున , నాని ల కాంబినేషన్ లో ఒక సినిమా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే . యువ దర్శకులు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత అశ్వనీదత్ నిర్మించనున్నాడు . ఎంటర్ టైన్ మెంట్ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రం ఫిబ్రవరి 24నుండి ప్రారంభం కానుంది . నాగార్జున – నాని ల కాంబినేషన్ అంటే అంచనాలు భారీగా నెలకొనడం ఖాయం , ఆ అంచనాలను అందుకునే రీతిలో స్క్రిప్ట్ తీర్చి దిద్దాడట శ్రీరామ్ ఆదిత్య . 
 
భలే మంచి రోజు , శమంతకమణి చిత్రాలతో తన ప్రతిభ ని నిరూపించుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ మల్టీ స్టారర్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టేసి తన రేంజ్ పెంచుకోవాలని ఆశిస్తున్నాడు . ఇక నాగార్జున తాజాగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నటిస్తుండగా నాని కృష్ణార్జున యుద్ధం లో నటిస్తున్నాడు . తెలుగునాట మల్టీ స్టారర్ చిత్రాలకు మళ్ళీ ఆదరణ లభిస్తుండటంతో ఆ చిత్రాల జోరు మొదలయ్యింది . 
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All