Homeటాప్ స్టోరీస్ఓటు బ్యాంకు రాజకీయాలు వద్దు - నాగబాబు

ఓటు బ్యాంకు రాజకీయాలు వద్దు – నాగబాబు

ఓటు బ్యాంకు రాజకీయాలు వద్దు - నాగబాబు
ఓటు బ్యాంకు రాజకీయాలు వద్దు – నాగబాబు

నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు మెగా బ్రదర్ నాగబాబు. ఓ పక్క టీవీ షోలతో బిజీగా ఉంటున్న ఆయన సమయం చిక్కినప్పుడల్లా సోషియల్ మీడియాని, యూట్యూబ్ ని హీటెక్కిస్తున్నారు. సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల బాలయ్య పై సంచలన వ్యాఖ్యలు చేసి టాలీవుడ్ లో చర్చకు తెరలేపిన నాగబాబు తాజాగా వార్తల్లో నిలిచారు.

 
ఇటీవల కాశ్మీర్ లో ఒక హిందూ పండిట్ అజయ్ అనే వ్యక్తిని హత్య చేశారు. ఈ విషయంపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ప్రధాని మోదీనే ఓటుబ్యాంక్ రాజకీయాలు మానండి అంటూ సెటైర్ లు వేయడం చర్చనీయాంశంగా మారింది.
 

‘నాకు నిన్నే తెలిసింది కాశ్మీర్ లో ఒక హిందూ పండిట్ అజయ్ అనే సర్పంచి ని చంపేశారు. ఫరవాలేదు చచ్చింది హిందూ పండిట్ కదా. చస్తే మనం ఎవరం ఫీల్ అవ్వక్కరలేదు.ఎక్కడో కాశ్మీరీ పండిట్, మనచుట్టం కాదు మన స్టేట్ కాదు..ఎక్కడో లయాడ్ అనే నల్లజాతి వ్యక్తి ని చంపితే ఇండియా లో కూడా స్పందించారు..

కానీ ఇది ఇండియా కదా ఈ సో కాల్డ్ మీడియా, సెక్యూలరిస్టులు స్పందించక్కరలేదు. కనీసం హిందువులకి ,హిందు సంస్థల కయినా బాధ్యత ఉండాలి కదా. మన రక్తం గడ్డ కట్టుకొని పోయింది. ఈ దేశం లో హిందువు గా పుట్టటం కన్నా ఒక గాడిద గా పుట్టటం బెటర్ అని ఎవరో మహానుభావుడు అన్న మాట నిజమేమో అనిపిస్తుంది. మోడీ గారూ ఓటుబ్యాంకు రాజకీయాలు వద్దు ప్లీజ్’ అని నాగబాబు సోషల్ మీడియా ట్విట్టర్లో స్పందించడం ఆసక్తికరంగా మారింది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All