Homeటాప్ స్టోరీస్ఈసారి నాగబాబు విమర్శలు చైనాపై

ఈసారి నాగబాబు విమర్శలు చైనాపై

ఈసారి నాగబాబు విమర్శలు చైనాపై
ఈసారి నాగబాబు విమర్శలు చైనాపై

మెగా బ్రదర్ నాగబాబు గత కొంత కాలంలో సోషల్ మీడియాలో చాలా బిజీగా ఉంటున్న విషయం తెల్సిందే. పలు వివాదాలపై స్పందించిన నాగబాబు బోలెడన్ని విమర్శలను మూటగట్టుకున్నాడు. ఎదుటివారిపై అంతకంటే ఎక్కువగానే విమర్శలను సంధించాడు. ముందుగా మహాత్మా గాంధీను చంపిన నాథురాం గాడ్సేను దేశ భక్తుడిగా చూడాలంటూ నాగబాబు పిలుపునివ్వడం విశేషం. ఆ తర్వాత బాలకృష్ణపై విమర్శలు, ఆ తర్వాత యువతరంలో దేశభక్తి లేకపోవడంపై స్పందించడం.. ఇలా వరసగా ఏదొక విషయంలో విమర్శలు చేస్తూ వచ్చాడు.

ఇక ఇప్పుడు చైనా వస్తువుల వాడకంపై నాగబాబు స్పందించాడు. కరోనా మహమ్మారికి మూలమైన చైనా ఇటు సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి భారత్ ను కలవరపెడుతోందని, ఇలాంటి చైనాకు సంబంధించిన వస్తువులను వాడకూడదని నాగబాబు పిలుపునిచ్చాడు. చైనా వస్తువులను బహిష్కరించి భారత్ లో తయారయ్యే వస్తువులనే కొందామని నాగబాబు అంటున్నాడు. మన దేశ డబ్బుతో బాగుపడి మన దేశంతో యుద్ధం చేయాలనీ ఆకాంక్షించే చైనా వంటి దేశం తయారుచేసే వస్తువులను కొనాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. దీని బదులుగా మన దేశ వస్తువులనే కొంటె డబ్బు మన దేశంలోనే ఉంటుందని అన్నాడు.

- Advertisement -

అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు నాగబాబు చెప్పినదానికి అవును నిజమే అని స్వాగతిస్తే మరికొందరు మీ కుటుంబ సభ్యులు ముందు చైనా యాప్ అయిన టిక్ టాక్ ను వాడటం ఆపమని సలహా ఇచ్చారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All