Homeన్యూస్నెల గ్యాప్ లో రెండు సినిమాలను విడుదల చేస్తోన్న శౌర్య

నెల గ్యాప్ లో రెండు సినిమాలను విడుదల చేస్తోన్న శౌర్య

నెల గ్యాప్ లో రెండు సినిమాలను విడుదల చేస్తోన్న శౌర్య
నెల గ్యాప్ లో రెండు సినిమాలను విడుదల చేస్తోన్న శౌర్య

నాగ శౌర్య లాస్ట్ సినిమాలు కొంత నిరాశపరిచిన మాట వాస్తవమే. అయితే తన సినిమాల పరంగా మాత్రం నాగ శౌర్య ఎక్కడా తగ్గట్లేదు. వరసగా ప్రాజెక్ట్స్ ను సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాల షూటింగ్స్ ను పూర్తి చేసాడు శౌర్య. ఈ రెండూ కూడా ఇప్పుడు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ రెండు చిత్రాలు కూడా ఒకదానితో మరొకటి సంబంధం లేదు. ముందుగా దసరా సందర్భంగా అక్టోబర్ 15న వరుడు కావలెను విడుదలవుతోంది. ఇది ప్యూర్ రొమాంటిక్ డ్రామా.

దీని తర్వాత నవంబర్ 12న అంటే నెల రోజుల గ్యాప్ లోనే నాగ శౌర్య మరో సినిమాను విడుదల చేస్తున్నాడు. నాగ శౌర్య నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా లక్ష్య నవంబర్ 12న విడుదలవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కొద్దిసేపటి క్రితం విడుదలైంది. సంతోష్ జాగర్లపూడి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

- Advertisement -

నాగ శౌర్య ఈ చిత్రం కోసం సిక్స్ ప్యాక్ బాడీని పెంచాడు. ఈ సినిమాలో ఆర్చర్ గా కనిపించనున్నాడు. ఏషియన్ సినిమాస్ బ్యానర్ లక్ష్యను నిర్మిస్తోంది. లక్ష్యకు సంబంధించిన మరింత సమాచారం త్వరలో బయటకు వస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All