Homeన్యూస్స్టార్ హీరో అవ్వడానికి ఏం కావాలో చెబుతోన్న నాగ శౌర్య

స్టార్ హీరో అవ్వడానికి ఏం కావాలో చెబుతోన్న నాగ శౌర్య

స్టార్ హీరో అవ్వడానికి ఏం కావాలో చెబుతోన్న నాగ శౌర్య
స్టార్ హీరో అవ్వడానికి ఏం కావాలో చెబుతోన్న నాగ శౌర్య

యంగ్ హీరో నాగ శౌర్య నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. దాదాపు 10-15 కోట్ల మార్కెట్ ఉన్న ఈ యువ హీరో, స్టార్ హీరో అవ్వడానికి ఏం కావాలో చెబుతున్నాడు. ఏ హీరోకైనా స్టార్ అవ్వడానికి ఐదు భారీ హిట్లు పడాలని, ఛలోతో ఆ విషయంలో తనకు మంచి ఆరంభం లభించిందని అన్నాడు. అలాగే వరుడు కావలెను తనకు సెకండ్ బ్లాక్ బస్టర్ అవుతుందని, మరో మూడు సూపర్ హిట్లు కొడితే చాలని తన థియరీను బయట పెట్టాడు.

అలాగే ఛలో తర్వాత తన కెరీర్ ను అనలైజ్ చేసాడు. ఛలో వంటి సూపర్ హిట్ తర్వాత వచ్చిన నర్తనశాల నిరాశపరిచిన మాట వాస్తవమేనని అన్న నాగ శౌర్య అలాంటి ప్లాప్ పడిన తర్వాత కూడా అశ్వద్ధామకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయని, ఆ చిత్రం ప్లాప్ అంటే మాత్రం తాను ఒప్పుకోనని అన్నాడు.

- Advertisement -

ఇక వరుడు కావలెను చిత్రంపై తనకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉందని చెప్పాడు ఈ హీరో. నిర్మాతలు తన తల్లిదండ్రులకు ఈ చిత్రాన్ని చూపించమన్నారని, అయితే అటూ ఇటూగా అనిపిస్తే చూపించాలి తప్ప ఈ చిత్రం కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది, అలాంటప్పుడు ప్రేక్షకులతో పాటు ఫస్ట్ డే చూస్తేనే కిక్ కాబట్టి చూపించలేదని అన్నాడు. మొత్తానికి ఈరోజు విడుదలవుతోన్న వరుడు కావలెనుపై ఈ కుర్రోడు చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All