Homeటాప్ స్టోరీస్నాగ‌శౌర్య మూవీ టైటిల్ ఇదేనా?

నాగ‌శౌర్య మూవీ టైటిల్ ఇదేనా?

నాగ‌శౌర్య మూవీ టైటిల్ ఇదేనా?
నాగ‌శౌర్య మూవీ టైటిల్ ఇదేనా?

యంగ్ హీరో నాగ‌శౌర్య స్పీడు పెంచాడు. గ‌తంలో పోలిస్తే వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా మారిపోయాడు. ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ మూడు చిత్రాల్లో న‌టిస్తున్నాడు. ఇందులో `సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం` ఫేమ్ సంతోష్ జాగ‌ర్ల‌పూడి తెర‌కెక్కిస్తున్న మూవీ ఒక‌టి. ఈ చిత్రాన్ని ఏషియ‌న్ ఫిలింస్ సునీల్ నారంగ్‌, శ‌ర‌త్‌మ‌రార్, పి. రామ్మోహ‌న్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ మూవీ కోస‌మే నాగ‌శైర్య ఎయిట్‌ ప్యాక్ బాడీతో క‌నిపించ‌బోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపుగా చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. విలువిద్య నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీ కోసం టైటిల్ అన్వేష‌ణ గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతోంది. `పార్థు` అనే టైటిల్‌ని అనుకున్నారు. కానీ దాన్ని ప‌క్క‌న పెట్టారు. `ధ‌నుర్ధారి` అని పెట్టాల‌నుకున్నారు. కానీ దాన్నీ ప‌క్క‌న పెట్టాల్సి వ‌చ్చింది.

- Advertisement -

`పార్థు` టైటిల్ అనుకున్నా అది త్రివిక్ర‌మ్ వ‌ద్ద వుండ‌టంతో చివ‌రికి `ల‌క్ష్యం` అనుకున్నార‌ట‌. అయితే ఇదే టైటిల్‌తో కొన్నేళ్ల క్రితం గోపీచంద్ హీరోగా శ్రీ‌వాస్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా రావ‌డంతో దాన్నీ ప‌క్క‌న పెట్టి ఫైన‌ల్‌గా `ల‌క్ష్య‌` అనే టైటిల్‌ని ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది. ఇదే టైటిల్‌ని ఈ సోమ‌వారం సాయంత్రం 5:04 నిమిషాలకు ప్ర‌క‌టించ‌బోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Naga Shaurya (@actorshaurya)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All