Homeటాప్ స్టోరీస్అఫీషియ‌ల్‌: నాగ‌శౌర్య న్యూ మూవీ టైటిల్ `ల‌క్ష్య‌`!

అఫీషియ‌ల్‌: నాగ‌శౌర్య న్యూ మూవీ టైటిల్ `ల‌క్ష్య‌`!

అఫీషియ‌ల్‌: నాగ‌శౌర్య న్యూ మూవీ టైటిల్ `ల‌క్ష్య‌`!
అఫీషియ‌ల్‌: నాగ‌శౌర్య న్యూ మూవీ టైటిల్ `ల‌క్ష్య‌`!

యంగ్ హీరో నాగ‌శౌర్య హీరోగా న‌టిస్తున్న చిత్రానికి `ల‌క్ష్య‌` అనే టైటిల్‌ని క‌న్ఫ‌ర్మ్ చేశారు. ముందుగా చెప్పిన‌ట్టే సోమ‌వారం 5:04 నిమిషాల‌కు ఈ చిత్ర టైటిల్‌ని ప్ర‌క‌టిస్తూ ఓ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసింది. ఇందులో హీరో నాగ‌శౌర్య మ్యాచో మ్యాన్‌గా స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తుండ‌టం ఆక‌ట్టుకుంటోంది. సోనాలి నారంగ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్  బ్యాన‌ర్‌పై నారాయ‌ణ దాస్ నారంగ్‌, పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు, శ‌ర‌త్‌మ‌రార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంతోష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీలో నాగ‌శౌర్య‌కు జోడీగా కేతిక శ‌ర్మ న‌టిస్తోంది. కీల‌క పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు క‌నిపించ‌బోతున్నారు. నాగ‌శౌర్య న‌టిస్తున్న 20వ చిత్ర‌మిది. ఈ మూవీ కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ఇప్ప‌టికే సినిమా అంచ‌నాల్నిపెంచేసింది. నాగ‌శౌర్య ఈ మూవీ కోసం ఎయిట్ ప్యాక్ బాడీతో వారియ‌ర్ లుక్‌లోక‌నిపించ‌బోతున్నారు. ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో ఈ మూవీ రూపొందుతోంది.

- Advertisement -

స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ మూవీలో అన్ని వ‌ర్గాల్ని అల‌రించే క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ని జోడించి తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా:  రామ్‌రెడ్డి, సంగీతం: కాల‌భైర‌వ‌, ఎడిటింగ్ : ‌జునైద్‌. వ‌చ్చే ఏడాది ప్ర‌ధ‌మార్థంలో ఈ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Naga Shaurya (@actorshaurya)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All