Homeటాప్ స్టోరీస్ఆ హీరో కు ఇగో ప్రాబ్లమా

ఆ హీరో కు ఇగో ప్రాబ్లమా

naga shourya facing problem with egoయంగ్ హీరో నాగశౌర్య ఈఏడాది మొదట్లో ఛలో సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు పైగా సొంత సినిమా కావడంతో చాలా సంతోషంగా ఉన్నారు నాగశౌర్య కుటుంబం మొత్తం . అదే జోష్ లో ప్రస్తుతం నర్తనశాల చిత్రం చేస్తున్నారు పైగా ఇది కూడా సొంత చిత్రమే ! అయితే ఈనెల 25న నాగశౌర్య నటించిన ” అమ్మమ్మ గారిల్లు ” చిత్రం విడుదల అవుతోంది ,దాని గురించి అస్సలు పట్టించుకోవడం లేదు నాగశౌర్య . ఓవైపు తన సినిమా విడుదల అవుతుంటే దాని ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన హీరో వాటిని పట్టించుకోకుండా ఇగో చూపిస్తున్నాడు .

అంత ఇగో ఉంటే హీరోగా కెరీర్ ని ఫణంగా పెట్టినట్లే ! నిర్మాత ఎన్నో ఆశలతో కోట్ల కొద్దీ డబ్బులు పెడితే ఇక్కడ ఎవరికీ వాళ్ళు తమతమ ఇగో లను చూపిస్తే దాని ప్రభావం సినిమాపైనే పడుతుంది . అసలే సినిమా బాగా ఆడుతున్నప్పటికీ నిర్మాతకు పెద్దగా లాభాలు రావడం లేని రోజులు ఇవి ఇలాంటి సమయంలో హీరో నిర్మాతకు అండగా ఉండాల్సింది పోయి ఇగో ని చూపిస్తూ చుక్కలు చూపించడం సరైన పద్దతి కాదు . ఒక నిర్మాత కు హిట్ వస్తే అతడు మరిన్ని సినిమాలు చేస్తాడు , దాని వల్ల వందలాది కుటుంబాలకు పని దొరుకుతుంది . నిర్మాత నష్టపోతే బోలెడు కుటుంబాలు రోడ్డున పడతాయి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All