
జెర్సీ వంటి హిట్ చిత్రాన్ని అందించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవక నాగవంశీ ప్రస్తుతం వరుసగా చిత్రాల్ని నిర్మిస్తున్నారు. గతంతో పోలిస్తే వరుసగా యంగ్ హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నితిన్ హీరోగా `రంగ్ దే` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మూవీతో పాటు సిద్ధు జొన్నలగడ్డతో `నరుడి బ్రతుకు నటన` వంటి చిత్రాన్ని నిర్మిస్తున్న సూర్యదేవర నాగవంశీ ఇటీవల యంగ్ హీరో నాగశౌర్యతో మరో చిత్రాన్నిసెట్స్ పైకి తీసుకొచ్చారు. `పెళ్లిచూపులు` ఫేమ్ రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతోంది.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సోమవారం పునః ప్రారంభమైంది.
ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు. నదియా, మురళీకృష్ణ, వెన్నెల కిషోర్, ప్రవీణ్, అనంత్ చ కిరీటి, దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కల్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్ధిక్ష ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్రశేఖర్, కెమెరా: వంశీ పచ్చి పులుసు.