Sunday, September 25, 2022
Homeన్యూస్దసరా బరిలో నాగ శౌర్య వరుడు కావలెను..!

దసరా బరిలో నాగ శౌర్య వరుడు కావలెను..!

Naga Shaurya Varudu Kavalenu Release Date Confirmed
Naga Shaurya Varudu Kavalenu Release Date Confirmed

నాగ శౌర్య, రీతు వర్మ జోడీగా లక్ష్మి సౌజన్య డైరక్షన్ లో వస్తున్న సినిమా వరుడు కావలెను. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగ శౌర్య సూపర్ కూల్ అండ్ క్లాసిక్ లుక్ తో అదరగొడుతున్నాడు. ఈమధ్యనే వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా లేటెస్ట్ గా సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు చిత్రయూనిట్.

- Advertisement -

కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే ఆడియెన్స్ థియేటర్లకు వస్తున్నారు. ఈ క్రమంలో సినిమాలన్ని వరుసగా రిలీజ్ అవుతున్నాయి. వాటి దారిలోనే నాగ శౌర్య వరుడు కావలెను సినిమా అక్టోబర్ 15న రిలీజ్ ఫిక్స్ చేశారు. దసరా కానుకగా నాగ శౌర్య సినిమా అవుతుంది. ఆల్రెడీ అక్టోబర్ 14న అజయ్ భూపతి డైరక్షన్ లో తెరకెక్కిన మహా సముద్రం రిలీజ్ ఫిక్స్ చేశారు. ఆ సినిమాకు పోటీగా ఒకరోజు తర్వాత నాగ శౌర్య వరుడు కావలెను వస్తుంది.

సినిమా సినిమాకు కథల విషయంలో తన టేస్ట్ చూపిస్తున్న నాగ శౌర్య వరుడు కావలెను సినిమాతో యూత్ ఆడియెన్స్ టార్గెట్ తో వస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా నాగ శౌర్య యాక్షన్ ఎంటర్టైనర్ గా లక్ష్య వస్తుంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts