Homeన్యూస్@న‌ర్త‌న‌శాల అంద‌ర్ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంది- హీరో నాగ‌శౌర్య‌

@న‌ర్త‌న‌శాల అంద‌ర్ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంది- హీరో నాగ‌శౌర్య‌

naga shaurya about at nartanasala first look launchఛ‌లో లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ కాంబినేష‌న్ లో ప్రోడ‌క్ష‌న్ నెం-2 గా తెర‌కెక్కుతున్న చిత్రం @న‌ర్త‌న‌శాల మెద‌టి లుక్ ని విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మాన్ని టాలీవుడ్ లో మెట్ట‌మెద‌టిసారిగా మాల్ లో ఓపెన్ ఈవెంట్ గా నిర్వ‌హించారు. దీనికి డ్ర‌స్ కోడ్ తో యూనిట్ అండ్ టెక్నిషియ‌న్స్ హ‌జ‌రవ్వ‌టం ప్ర‌త్యేఖ ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఈ కార్య‌క్ర‌మంలో హీరోయిన్స్ క‌ష్మిర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్‌, శివాజి రాజా, జెమిని సురేష్‌, రాఘ‌వ‌, రాకెట్ రాఘ‌వ‌, త‌దిత‌రులు హ‌జ‌రవ్వ‌గా, కొరియోగ్రాఫ‌ర్ విజ‌య్‌, సినిమాటోగ్ర‌ఫి విజ‌య్ సి కుమార్‌, లైన్ ప్రోడ్యూస‌ర్ బుజ్జి, లిరిక్ రైట‌ర్స్ ఓరుగంటి, శ్రీమ‌ణి లు ముఖ్యంగా హ‌జ‌ర‌య్యారు.. ఈ చిత్రానికి క్రియోటివ్ ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన శ్రీనివాస చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌కుడు, చిత్ర స‌మ‌ర్ప‌కుడు శంక‌ర ప్ర‌సాద్ మూల్పూరి, చిత్ర నిర్మాత ఉష మూల్పూరి. ఈ కార్య‌క్ర‌మాన్ని చూప‌రుల‌ను ఆక‌ట్టుకునేలా డిజైన్ చేశారు.

ఈ కార్య‌క్ర‌మం లో హీరో నాగ‌శౌర్య మాట్లాడుతూ.. @న‌ర్త‌న‌శాల చిత్రం షూటింగ్ మెత్తం పూర్తిచేశాము.. లెజెండ‌రి చిత్రం న‌ర్త‌న‌శాల పేరు ఏమాత్ర పాడుచేయ్య‌కుండా నిల‌బెట్టెలా మా చిత్రాన్ని చేశాము. అలాగే మా ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ గారు చాలా బాగా చేశారు. న‌ర్త‌న‌శాల ఫ్రెష్ లుక్ చూశారుగా అంద‌రికి న‌చ్చిందిగా.. ఇలానే మా చిత్రం కూడా అంద‌ర్ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. త్వ‌ర‌లో మ‌రింత ప్ర‌మెష‌న్ తో మీ ముందుకు వ‌స్తాము.. అన్నారు.

- Advertisement -

నిర్మాత ఉషా మూల్పూరి మాట్లాడుతూ.. ఛ‌లో చిత్రాన్ని ఎంత ఘ‌న‌విజ‌యం చేశారో మా @న‌ర్త‌నశాల ని కూడా అంత‌కు మించి విజ‌యం చేయ్యాల‌ని కోరుకుంటున్నాను. ఈ చిత్ర త‌ప్ప‌కుండా అంద‌ర్ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. అని అన్నారు

చిత్ర స‌మ‌ర్ప‌కుడు శంక‌ర్‌ప్ర‌సాద్ మూల్పూరి మాట్లాడుతూ.. నిజాయితిగా ఛ‌లో చిత్రాన్ని చేశాము.. అంతే నిజాయితిగా మీరు ఘ‌నవిజ‌యం అందించారు. అలాగే మా @న‌ర్త‌న‌శాల చిత్రాన్ని నిజాయితిగా షూటింగ్ పూర్తిచేశాము. ఈ చిత్రం మీ అంద‌రి చిత్రంగా మీ ముందుకు వ‌స్తుంది. అంద‌రూ ఛ‌లో కంటే మంచి విజ‌యాన్ని అందించాల‌ని కోరుకుంటున్నాను. అని అన్నారు

ద‌ర్శకుడు శ్రినివాస్ చ‌క్ర‌వ‌ర్తి మాట్లాడుతూ.. @న‌ర్త‌న‌శాల చిత్రం చాలా బాగా వ‌చ్చింది దీనికి ముఖ్య కార‌ణం మా హీరో నాగ‌శౌర్య .. పాత్ర‌లోని ఇన్‌వాల్వ్ అయ్యి చేశాడు..మెద‌టి లుక్ ని చూశారుగా ఈ చిత్రం అదే రేంజి లో వుంటుంది. ఇక మా నిర్మాత‌లు శంక‌ర్ గారు, ఉష గారు, బుజ్జి గారు వీరంతా నా ఫ్యామిలి మెంబ‌ర్స్ అని ప్ర‌త్యేఖంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ఫ్యామిలికి సినిమా అంటే ఫ్యాష‌న్ ఈ బ్యాన‌ర్ లో ఏ చిత్ర వ‌చ్చినా అది బ్లాక్‌బ‌స్ల‌ర్ ఖాయం. అని అన్నారు

శివాజిరాజా గారు మాట్లాడుతూ.. ఇండ‌స్ట్రిలో ఎన్ని ప్రోడ‌క్ష‌న్ హౌస్ లు వున్నా కూడా కొన్నిటి గురించి మాత్ర‌మే మాట్లాడుకుంటాం.. వాటిలో ముందు వ‌ర‌స‌లో ఐరా క్రియెష‌న్స్ ఓక‌టి.. వీళ్ళంతా ఫ్యామిలి లా క‌లిసిపోతారు. చ‌క్క‌గా చూసుకుంటారు. శౌర్య గురించి చెప్పాలంటే చాలా మంచి భ‌విష్య‌త్తు వున్న హీరో.. ఛ‌లో తో స్టార్ అయ్యాడు.. ఈ చిత్రం తో మ‌రో ప‌దింత‌లు ఎదుగుతాడు.. చాలా మంచి చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.. అన్నారు

హీరోయిన్ క‌ష్మిరా మాట్లాడుతూ.. శౌర్య చాలా మంచి న‌టుడు.. ఈచిత్రం అంద‌రిని ప‌ది మెట్లు ఎక్కిస్తుంది. చాలా మంచి చిత్రం తో ప‌రిచ‌యం అవుతున్నందుకు చాలా ఆనందంగా వుంది. అన్నారు.

మ‌రో హీరోయిన్ యామిని భాస్క‌ర్ మాట్లాడుతూ.. ఈ చిత్రం యూనిట్ అంద‌రికి చాలా మంచి పేరు వ‌స్తుంది. అలానే నాగ‌శౌర్య ఫ్యాన్స్ పండ‌గ లా వుంటుంది. అలానే ఈ చిత్రం లో ప్ర‌తి ఓక్క‌రికి కేర‌క్ట‌రైజేష‌న్ వుంటుంది. అని అన్నారు

న‌టీన‌టులు..

నాగ‌శౌర్య‌, క‌ష్మర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్‌, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, అజ‌య్‌, శివాజి రాజ‌, సుధ‌, ప్రియ‌, జెమిని సురేష్‌, రాకేట్ రాఘ‌వ‌, స‌త్యం రాజేష్‌, రాఘ‌వ‌, ఉత్తేజ్‌, తిరుప‌తి ప్ర‌కాష్‌, ప‌ద్మ జ‌యంతి, మాధురి త‌దిత‌రులు న‌టించ‌గా..

 

క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం.. శ్రీనివాస్ చ‌క్ర‌వ‌ర్తి
నిర్మాత‌.. ఉష మూల్పూరి
లైన్ ప్రోడ్యూస‌ర్‌.. బుజ్జి
ఐరా డిజిట‌ల్‌– ఎమ్‌.ఎన్‌.ఎస్ గౌత‌మ్‌
డి ఓ పి.. విజ‌య్ సి కుమార్‌
సంగీతం.. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్
ఎడిట‌ర్‌.. కొట‌గిరి వెంక‌టేశ్వ‌రావు, త‌మ్మిరాజు
స్క్రిప్ట్ అసోసియోట్‌.. కాశి న‌డింప‌ల్లి
పిఆర్ ఓ .. ఏలూరు శ్రీను
ప‌బ్లిసిటి డిజైన‌ర్‌.. అనంత్‌
ఆర్ట్‌.. కిర‌ణ్ కుమార్ మ‌న్నె
ఫైట్స్‌.. విజ‌య్ , మ‌ల్లేష్‌
కొరియోగ్ర‌ఫి.. విశ్వ ర‌ఘు, విజ‌య్ ప్ర‌కాష్‌,
లిరిక్స్‌.. భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్‌, శ్రీమ‌ణి, ఒరుగంటి

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All