Homeటాప్ స్టోరీస్టీజ‌ర్ టాక్‌: ఆర‌డుగుల నారాయ‌ణాస్త్రం!

టీజ‌ర్ టాక్‌: ఆర‌డుగుల నారాయ‌ణాస్త్రం!

టీజ‌ర్ టాక్‌: ఆర‌డుగుల నారాయ‌ణాస్త్రం!
టీజ‌ర్ టాక్‌: ఆర‌డుగుల నారాయ‌ణాస్త్రం!

యాక్ష‌న్ సినిమాతో ఆక‌ట్టుకోవాల‌ని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు యంగ్ హీరో నాగ‌శౌర్య‌. అందు కోసం ప్ర‌య‌త్నాలు చేసి విఫ‌ల మ‌య్యారు కూడా. అయితే గ‌త అనుభ‌వాల‌ని దృష్టిలో పెట్టుకుని మాస్ ప్రేక్ష‌కుల్ని మెస్మ‌రైజ్ చేసే క‌థ‌తో నాగశౌర్య చేస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `అశ్వ‌ద్ధామ‌`. సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేష‌న్స్‌లో నాగ‌శౌర్య మ‌ద‌ర్ ఉష ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెహ‌రిన్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ద్వారా ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. శుక్ర‌వారం ఈ చిత్ర టీజ‌ర్‌ని క్రేజీ హీరోయిన్ సమంత సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేశారు.

`ఎలా వుంటాడో కూడా తెలియ‌ని ఒక రాక్ష‌సుడు.. వాడికి మాత్ర‌మే తెలిసిన ఒక ర‌హ‌స్యం.. సైర‌న్ కూత‌ల కింద ప‌నిచేసే వాడి సైన్యం…గ‌మ్యం తెలియ‌ని ఒక యుద్ధం. ఆ యుద్ధం గెల‌వాలంటే ఒక ఆర‌డుగుల నారాయ‌ణాస్త్రం రావాలి.. ఒక అశ్వ‌ద్ధాముడు రావాలి… టీజ‌ర్ ప్రారంభం నుంచి హీరో పాత్ర‌ని, చిత్ర క‌థ‌ని స్తూలంగా వివ‌రిస్తూ సీనియ‌ర్ న‌టుడు శుభ‌లేఖ సుధాక‌ర్ ఇస్తున్న న‌రేష‌న్ సినిమా ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతుంద‌ని తెలియ‌జేస్తోంది. టీజ‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటోంది. కాన్సెప్ట్ కొత్త‌గా వుంటూనే సినిమా ఫాస్ట్ పేస్‌తో సాగేలా క‌నిపిస్తోంది.

- Advertisement -

శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల అందించిన నేప‌థ్య సంగీతం సినిమాని ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్న‌ట్టు క‌నిపిస్తోంది. ట్రైల‌ర్ లోని ప్ర‌తీ ఫ్రేమ్‌ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త ఫీల్‌ని అందించే విధంగా క‌నిపిస్తోంది. `ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని గ‌ర్వంగా చెప్ప‌గ‌ల‌ను. ఢిల్లీ. ముంబైల‌లో అమ్మాయిల‌పై జ‌రిగిన సంఘ‌ట‌న‌ల స్ఫూర్తితో ఈ చిత్ర క‌థ‌ని రాసుకున్నాం. `ఛ‌లో`కి కూడా క‌థ రాశాను కానీ పేరు వేసుకోలేదు. అమ్మాయిల‌కు ర‌క్ష‌ణ లేదు. అంద‌రూ బాగుండాల‌నే సంక‌ల్పంతో ఈ సినిమా తీశాం. న‌కు ల‌వ‌ర్‌బాయ్ ఇమేజ్ అంటే చిరాకు. దాని నుంచి బ‌య‌టికి రావాలని ఈ సినిమా చేశాను అని హీరో నాగ‌శౌర్య తెలిపారు. జ‌న‌వ‌రి 31న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All